సాంప్రదాయ సాగుకు శాస్త్రీయ పద్ధతిని జోడిద్దాం
వరి, కంది పంటల్లో సస్యరక్షణ పోషక యాజమాన్య పద్ధతులపై క్షేత్రస్థాయి ప్రదర్శన
చేవెళ్ల, ఆగస్టు 25 (విజయక్రాంతి): సస్యరక్షణ పోషక యాజమాన్యంపై క్షేత్రస్థాయి ప్రదర్శనలు ఆత్మ చేవెళ్ల వారి సౌజన్యంతో వ్యవసాయ సహాయ సంచాలకులు బి. సురేష్ బాబు ఆధ్వర్యంలో చేవెళ్ల మండలంలోని ఆలూరు, చేవెళ్ల మల్కాపూర్ గ్రామాల్లో వరి, కంది పంటల్లో సస్యరక్షణ, పోషక యాజమాన్య పద్ధతులపై రైతుల పొలాల్లో క్షేత్రస్థాయి ప్రదర్శనలు నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులకు పంటల సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెగుళ్లు మరియు వ్యాధుల నివారణ సమగ్ర సస్యరక్షణ పోషక యాజమాన్య పద్ధతులపై అవగాహన కల్పించారు.
రైతులు సాంప్రదాయ పద్ధతులతో పాటు శాస్త్రీయ సాగు విధానాలను పాటించాలని సూచించారు. పంటలకు సమతుల్యంగా పోషకాలు అందించడం, నేల స్వభావానికి అనుగుణంగా ఎరువులను వినియోగించడం, సకాలంలో సస్యరక్షణ చర్యలు చేపట్టడం ద్వారా అధిక దిగుబడులు సాధించవచ్చని ఏఓ శంకర్లాల్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఈఓలు పి. బాలకోటేశ్వరరావు వి. మౌనిక ఎం. ప్రతిభ ఎ. గాయత్రితో పాటు ఆయా గ్రామాల రైతులు పాల్గొన్నారు.






