4 June, 2026 | 3:46 AM

ఈవీఎంల గోడౌన్‌ను తనిఖీ చేసిన కలెక్టర్ అంకిత్

04-06-2026 02:51 AM

భద్రాద్రి కొత్తగూడెం, జూన్ 3 (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని కొత్తగూడెం ఆర్డీఓ కార్యాలయం సమీపంలో ఉన్న ఈవీఎంల గోడౌన్ను జిల్లా కలెక్టర్ అంకిత్ బుధవారం తనిఖీ చేశారు. త్రైమాసిక తనిఖీల్లో భాగంగా నిర్వహించిన ఈ తనిఖీలో గోడౌన్ భద్రతా ఏర్పాట్లు, ఈవీఎంలు, వీవీప్యాట్ల భద్రతా పరిస్థితులను పరిశీలించారు. ముందుగా గోడౌన్ సీల్ను పరిశీలించిన కలెక్టర్, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు మరియు సంబంధిత అధికారుల సమక్షంలో సీల్ను తెరిపించి గోడౌన్లోకి ప్రవేశించారు.

అనంతరం ఈవీఎంలు, వీవీప్యాట్లు భద్రపరిచిన గదులను క్షుణ్ణంగా పరిశీలించి, తనిఖీ అనంతరం తిరిగి గోడౌన్కు సీల్ వేయించారు. ఈ సందర్భంగా కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ, ఈవీఎంల భద్రత విషయంలో అధికారులు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గోడౌన్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు, అనుమతి లేనిదే ఎవ్వరినీ లోపలికి అనుమతించరాదని సంబంధిత అధికారులు, భద్రతా సిబ్బందికి ఆదేశించారు.

అలాగే సీసీ కెమెరా నియంత్రణ గదిని సందర్శించి కెమెరాల పనితీరు, నిఘా వ్యవస్థను పరిశీలించారు. తనిఖీ అనంతరం గోడౌన్ తనిఖీ రిజిస్టర్లో కలెక్టర్ సంతకం చేశారు.  ఈ కార్యక్రమంలో ఎన్నికల సూపర్డెంట్ రంగ ప్రసాద్, మాస్టర్ ట్రైనర్ పూసపాటి సాయి కృష్ణ,  కాంగ్రెస్ పార్టీ లక్ష్మణ్ అగర్వాల్, బిజెపి జె. మోహన కృష్ణ,  టిఆర్‌ఎస్ అనుదీప్ ఎస్, అమ్ ఆద్మీ పార్టీ రాంబాబు,వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఎన్నికల విభాగం సిబ్బంది నవీన్, అశోక్,భద్రతా సిబ్బంది పాల్గొన్నారు.