17 August, 2026 | 1:03 AM

సీఎంను కలిసిన కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

17-08-2026 12:27 AM

కామారెడ్డి, ఆగస్టు 16 (విజయక్రాంతి): రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగువాన్ కలిసి మేమేంటో గోడ గడియారం ను అందజేశారు. జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారా వు కూతురు వివాహ విందుకు హాజరైన సీఎం రేవంత్ రెడ్డిని కలెక్టర్ కలిసి పరిచయం చేసుకున్నారు.

అనంతరం జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు కుమార్తె నూతన వధూవరులను కలెక్టర్ ఆశిష్ సంగు వాన్ కలిసి ఆశీర్వదించారు. రాష్ట్ర పిసిసి ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి సతీమణి మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం హిందూ ప్రియ సీఎంను కలిసి రాఖీ బంధన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఇందుప్రియను సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు.