1 June, 2026 | 8:05 PM

ప్రజావాణి దరఖాస్తులను వెంటవెంటనే పరిష్కరించాలి

01-06-2026 07:18 PM

నిర్మల్,(విజయక్రాంతి): ప్రజావాణి దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను ఆయన స్వయంగా స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఆయా శాఖల అధికారులు ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి తక్షణమే స్పందించాలని సూచించారు.

మండలాల వారీగా పెండింగ్‌లో ఉన్న ప్రజావాణి దరఖాస్తులకు సంబంధించి సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు. ప్రజల సమస్యలను సంబంధిత శాఖలు సమన్వయంతో పరిష్కరించేలా పనిచేయాలని ఆదేశించారు. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ప్రజలు విద్య, వైద్యం, ఇందిరమ్మ ఇండ్లు, పింఛన్లు, భూ సమస్యలకు సంబంధించి దరఖాస్తులను కలెక్టర్‌కు సమర్పించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు బి. వెంకటేశ్వర్లు, కిషోర్ కుమార్, డిఆర్ఓ రాథోడ్ రమేష్, ఎస్డీసీ జల కుమారి, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.