1 June, 2026 | 7:54 PM

ఘనంగా ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి జన్మదిన వేడుకలు

01-06-2026 07:21 PM

దొనకొండ రమేష్ ఆధ్వర్యంలో కేక్ , బట్టర్ మిల్క్, అరటిపండ్లు పంపిణీ

తుంగతుర్తి,(విజయక్రాంతి): తుంగతుర్తి మండల కేంద్రంలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి జన్మదిన వేడుకలను కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు దొనకొండ రమేష్ ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు మెయిన్ రోడ్డుపై బాణాసంచాలు కాల్చి కేక్ కట్ చేసి మిఠాయి పంచుకున్నారు. అనంతరం ప్రజలకు బట్టర్ మిల్క్, అరటిపండ్లు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లుతూ రానున్న రోజుల్లో ఉన్నత పదవులను అధిరోహించి పేద ప్రజలకు సేవ చేయాలని ఆకాంక్షించారు.