పది ఫలితాల్లో జిల్లా టాపర్‌ని అభినందించిన కలెక్టర్
నాగర్ కర్నూల్ ఏప్రిల్ 30 (విజయక్రాంతి): పది ఫలితాల్లో సిఎన్‌ఆర్ పాఠశాల విద్యార్థులు మరోసారి ఉత్తమ ప్రతిభ కనబర్చారు. 589 మార్కులు సాధించి జిల్లాలో టాపర్ గా నిలిచిన విద్యార్థిని డి.వన్ మై రెడ్డిని గురువారం జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటీల్ అభినందించారు. వారితో పాటు 572 మార్కులు సాధించిన డి.సృజన్, 571 మార్కులు సాధించిన విద్యార్థులు డి.అఖిల, వెంకట అక్షయలను, 570 మార్కులు సాధించిన శివశంకర్ వరప్రసాద్ లను కలెక్టర్ ప్రశంసించారు.
విద్యార్థులు క్రమశిక్షణ, పట్టుదలతో చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించి ఇతరులకు ఆదర్శంగా నిలవాలన్నారు. భవిష్యత్తులో మరింత ఉన్నత విద్యలో రాణించాలని ప్రోత్సహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల వ్యవస్థాపకులు భాస్కర్ రావు, చంద్రకళ, ఫసియోద్దిన్, వెంకటేశ్వరరావు, పాఠశాల ప్రిన్సిపాల్ హజీరా, ఉపాధ్యాయులు శ్రీకాంత్, భార్గవి, విద్యార్థులు ఉన్నారు.






