సోషల్ ఇంటెలిజెన్స్ ఉషా యనమండ్రకు సత్కారం
హైదరాబాద్, ఏప్రిల్ 30 (విజయక్రాంతి): సైబర్ భద్రత అవగాహన, డిజిటల్ విద్యా కార్యక్రమాలకు అందించిన సేవలకు గాను సోషల్ ఇంటెలిజెన్స్ ఎక్స్‌పర్ట్, కెరీర్ స్ట్రాటజిస్ట్ డాక్టర్ ఉషా యనమండ్రను సొసై టీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ (ఎస్సీఎస్సీ), సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ సంయుక్తంగా సత్కరించాయి.
ఎస్సీఎస్సీ, సైబరాబాద్ పోలీసులు నిర్వహించిన దిల్సే ట్రైన్ -ది -ట్రైనర్ ప్రోగ్రామ్ సందర్భంగా సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డాక్టర్ ఎం. రమే ష్ ఈ సత్కారాన్ని అందజేశారు. ఈ కార్యక్రమం సైబర్ అవగాహన, డిజిటల్ భద్రత, సైబర్ నేరాలపై తక్షణ స్పందన విధానాలపై అవగాహన కల్పించే ఉద్దేశంతో నిర్వహించబడింది.
ఈ కార్యక్రమంలో నిపుణులు డిజి టల్ ఫుట్‌ప్రింట్స్, బాధ్యతాయుతమైన ఆన్‌లైన్ ప్రవర్తన, ఫేక్ న్యూస్, ఆన్‌లైన్ గేమింగ్ ప్రమాదాలు, సైబర్ చట్టాలు, సోషల్ ఇంజినీరింగ్ మోసాలు, యూపీఐ మోసాలు, లోన్ యాప్ స్కామ్‌లపై పాల్గొన్న వారికి అ వగాహన కల్పించారు. అలాగే సైబర్ మోసాలపై వెంటనే 1930 హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేయాల్సిన అవసరాన్ని, గోల్డెన్ అవర్ ప్రా ముఖ్యతను అధికారులు వివరించారు.
ఈ సందర్భంగా డాక్టర్ ఉషా యనమండ్ర మా ట్లాడుతూ సైబరాబాద్ పోలీసులు, ఎస్సీఎస్సీ నుంచి ఈ గుర్తింపు అందుకోవడం ఎంతో గౌరవంగా భావిస్తున్నాను. సైబర్ సేఫ్టీ అంబాసిడర్‌గా గుర్తింపు పొందడం నా లో మరింత బాధ్యతను పెంచింది. డిజిటల్ ప్రపంచంలో సురక్షితమైన, అవగాహన కలిగిన సమాజ నిర్మాణానికి నేను మరింత క ట్టుబడి పనిచేస్తాను. ఇది కేవలం గౌరవం మాత్రమే కాదు, నేను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత కూడా అని అన్నారు. కాగా ఈ కార్యక్రమం వాలంటీర్ల సత్కారం, సర్టిఫికెట్ల ప్రదా నం, ఎస్సీఎస్సీ, సైబర్ క్రైమ్ అధికారులతో నిర్వహించిన ఇంటరాక్టివ్ సెషన్‌తో ముగిసింది.






