అభివృద్ధికి మారుపేరు కాంగ్రెస్
ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్
మహబూబాబాద్, ఏప్రిల్ 30 (విజయక్రాంతి): సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలతో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతుందని మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళి నాయక్ అన్నారు. నియోజకవర్గ పరిధిలోని పర్వతి గిరి గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేయ తలపెట్టిన 33 కేవీ విద్యుత్ సబ్స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజల మౌలిక వసతుల కల్పన కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టి అభివృద్ధికి కేరాఫ్ గా నిలుస్తోందని తెలిపారు. ఈ ప్రాంత రైతులు, ప్రజలు, పరిశ్రమలకు విద్యుత్ సౌకర్యం మెరుగుపడుతుందని, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క దృష్టికి తీసుకు వెళ్ళగానే వెంటనే సబ్ స్టేషన్ మంజూరు చేశారని కృతజ్ఞతలు తెలిపారు. మహబూబాబాద్ నియోజకవర్గ సుమారుగా 100 కోట్ల రూపాయల నిధులు కేటాయించి అభివృద్ధి చేశారని సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డిసిసి మాజీ అధ్యక్షుడు జన్నారెడ్డి భరత్ చందర్ రెడ్డి పాల్గొన్నారు.






