కాళేశ్వరం ప్రాజెక్టుపై తప్పుడు ఆరోపణలు మానుకోవాలి
మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్
మోతే: కాళేశ్వరం ప్రాజెక్టుపై తప్పుడు ఆరోపణలు మానుకోవాలని సీబీఐకి ఘోశ్ కమిషన్ కు అప్పజెప్పడంపై మోతే మండల కేంద్రంలో బిఆర్ఎస్ మోతే మండల అధ్యక్షుడు శీలం సైదులు ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించడం జరిగింది. రాస్తారోకోలో మాజీ ఎంపీ బిఆర్ఎస్ సూర్యాపేట జిల్లా అధ్యక్షులు బడుగుల లింగయ్య యాదవ్ పాల్గొని మాట్లాడుతూ... కేసిఆర్ నాయకత్వంలో కాళేశ్వరం ద్వారా తెలంగాణ రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిదని పంటలు సస్యశ్యామలంగా పండయాని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 20 నెలల్లో కాళే శ్వరం నీళ్లు రాకుండా చేసి సాగర్ నీళ్లు రాకుండా చేసి రైతులను ఇబ్బందులకు గురిచేస్తూ యూరియా కూడా దొరకని దుస్థితి నెలకొన్నదని అన్నారు.
ఎలక్షన్ల ముందు ఆరు గ్యారెంటీలు ఇస్తామని హామీలు ఇచ్చి గెలిచి ఒక హామిని కూడా నిలబెట్టుకోలేని కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల నోట్లో మట్టి కొట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు. కాలేశ్వరం ప్రాజెక్టును సిబిఐ కి ఇవ్వడం దుర్మార్గమైన చర్యఅని అప్రజాస్వామిక ఆలోచనలను వెంటనే విరమించుకోవాలని లేని ఎడల మా పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని తెలియజేశారు.






