ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అదనపు తరగతి గదులను ప్రారంభించిన కలెక్టర్
ఆదిలాబాద్, ఆగస్టు 25 (విజయక్రాంతి) : విద్యా రంగం అభివృద్ధికి ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందని జిల్లా కలెక్టర్ రాజర్షిషా అన్నారు. మంగళవారం స్థానిక బొక్కల్గూడ ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో మున్సిపల్ చైర్ పర్సన్ బండారి అనూషతో కలిసి ఆయన నూతన అదనపు తరగతి గదులను ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం కళాశాల ఆవరణలో వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యార్థులతో కలిసి కలెక్టర్ మొక్కలను నాటి నీరు పోశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రభుత్వ జూనియర్ కళాశాలల ఫలితాలను మెరుగుపరిచేందుకు ప్రత్యేకంగా జిల్లా అకడమిక్ మానిటరింగ్ క మిటీని ఏర్పాటు చేసి, తగిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అత్యధికంగా 1,200 మంది విద్యార్థులతో నాలుగు మీడియాలలో విద్యాబోధన సాగుతున్న ఈ కళాశాల జిల్లాకే తలమానికమని కొనియాడారు. అనంతరం ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ఉత్తమ ప్రతిభ కన బరిచిన విద్యార్థులకు మెమంటో లను కలెక్టర్, అతిథులు అందజేశారు.
ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాజేశ్వర్, ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, డీఐఈవో గణేష్ జాదవ్, డీఎంబ్ల్యూవో కలీం, మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్, వివిధ వార్డుల కౌన్సిలర్లు సుచిక, సుష్మా, సంజయ్, జీవన్, ఇతర అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు.
పుస్తక పఠనంతోనే ఉజ్వల భవిష్యత్
- జిల్లా కలెక్టర్ రాజర్షిషా
నేరడిగొండ, ఆగస్టు 25 (విజయ క్రాంతి) : పుస్తకాలను ఇష్టంగా చదివినవారే సమాజంలో ఉన్నత స్థానాలకు చేరుకుంటారని జిల్లా కలెక్టర్ రాజర్షిషా స్పష్టం చేశారు. మంగళవారం నేరడిగొండ మండలం వాగ్ధారి గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన గ్రంథాలయాన్ని జిల్లా గ్రం థాలయ సంస్థ చైర్మన్ మల్లెపూల నర్సయ్యతో కలిసి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రంథాలయాలు విజ్ఞాన బాండాగారాలని, పో టీ పరీక్షలకు సిద్ధమయ్యే యువతకు ఇవి ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు.
సెంట్రల్ లైబ్రరీ తరహాలోనే రాబోయే రోజుల్లో వివిధ ప్రాంతాల్లో పబ్లిక్ రీడింగ్ రూమ్లను సైతం అందుబాటులోకి తీసుకువస్తామని వెల్లడించారు. గ్రామ అభివృద్ధిపై దృష్టి సారించిన వాగ్ధారిలోని సమస్యలను ప్రాధాన్యతా క్రమంలో పరిష్కరిస్తామని చెప్పారు. ప్రతి ఇంటా తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించి గ్రామాన్ని పరిశుభ్రంగా, స్వచ్ఛంగా ఉంచుకోవాలని పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా గ్రామంలో 4 వేర్వేరు విభాగాలుగా చెత్త సేకరణకు ఏర్పాటు చేసిన ప్రత్యేక ట్రాక్టర్ను కలెక్టర్ ప్రారంభించారు.అనంతరం ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు యూనిఫామ్లను కలెక్టర్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీకాంత్, జిల్లా పంచాయతీ అధికారి రమేష్, డీఎల్పీఓ ఫణిందర్, సర్పంచ్ విజయ్ కుమార్, ఇతర శాఖల అధికారులు, సిబ్బంది, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.






