Breaking News

కోదండాపూర్‌లో ఘనంగా వన మహోత్సవం

26-08-2026 | 12:00am

ఎర్రవల్లి, ఆగస్టు 25: జోగులాంబ గద్వాల్ జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు ఆదేశాల మేరకు కోదండాపూర్ పోలీస్స్టేషన్ ఆవరణలో వన మహోత్సవాన్ని నిర్వహించారు. డీఎస్పీ వై. మొగలయ్య ఆధ్వర్యంలో 3,000 మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. సీఐ ప్రదీప్కుమార్, ఎస్‌ఐ తరుణ్కుమార్రెడ్డి, ఎంపీడీఓ మహేష్, సర్పంచ్ నారాయణ తదితరులు పాల్గొని మొక్కలు నాటారు. మొక్కలను నాటి సంరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యతని డీఎస్పీ పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు