డబుల్ బెడ్ రూమ్ వివరాలు తెలుసుకుంటున్న కలెక్టర్
జల సంరక్షణతోనే జీవనాధారం
నిర్మల్ ,జులై 28(విజయ క్రాంతి): జల సంరక్షణతోనే జీవనాధారం ముడిపడి ఉందని అటువంటి జిలాని భూమిలో ఇంకించవలసిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా తెలిపారు. మంగళవారం నిర్మల్ మండలంలోని కౌట్ల కే గ్రామంలో జలసిరి పనులను పరిశీలించారు ప్రతి గ్రామంలో ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలని సూచించారు.
ప్రస్తుతం కరువు పరిస్థితుల నేపథ్యంలో భూగర్భ జలాల కోరుతా ఏర్పడకుండా ప్రజలు స్వచ్ఛందంగా జల సంరక్షణ పై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. తక్కువ నీటితో పంటలు పండించే విధానాన్ని అలవర్చుకోవాలన్నారు. గ్రామంలో ఇంద్రమ్మ పథకం కింద నిర్మించిన ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించారు.
డబుల్ బెడ్ రూమ్ లపై ఆరా
సిద్దాపూర్ శివారులోని డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక కేటాయింపులపై జిల్లా కలెక్టర్ ప్రత్యేక దృష్టి పెట్టారు. అప్పటి బి ఆర్ ఎస్ ప్రభుత్వం ఇల్లు నిర్మించినప్పటికీ లబ్ధిదారులకు లక్కీ డ్రా ద్వారా ఎంపిక చేసిన ఇండ్లు ఇప్పటివరకు వారికి అప్పగించకపోవడంతో లబ్ధిదారులు జిల్లా కలెక్టర్ ను కలిసి విన్నవించారు. మేరకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పరిశీలించిన కలెక్టర్ త్వరలో లబ్ధిదారులకు ఇల్లు కేటాయించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో అతను కలెక్టర్ వెంకటేశ్వర్లు. హౌసింగ్ శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ రవిబాబు, అధికారులు ఉన్నారు.






