29 July, 2026 | 12:49 AM

డ్రంక్ అండ్ డ్రైవ్ చేసిన వారికి శిక్ష తప్పదు

29-07-2026 12:00 AM

గుమ్మడిదల ఎస్సై అరుణ్ కుమార్ గౌడ్

గుమ్మడిదల, జులై 28: డ్రంక్ అండ్ డ్రైవ్ చేసినవారికి చట్టం తగిన శిక్ష విధిస్తుందని, అలా చేసిన వారికి శిక్ష తప్పదని గుమ్మడిదల ఎస్త్స్ర అరుణ్ కుమార్ గౌడ్ తెలిపారు. ఈ నెలలో గుమ్మడిదల పోలీస్ నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ చెక్ అప్ లలో మందు తాగి వెహికిల్ నడుపుతున్న 11 మంది మందు బాబులకు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ నిర్వహించి మంగళవారం జిన్నారం జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు కు పంపగా వారిలో ఇద్దరికీ 2 వేల జరిమానా విధించగా 5 మందికి ఒక్క రోజు  జైలు శిక్ష విధించినారని తెలిపారు.