7 March, 2026 | 7:54 PM

ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని తనిఖీ చేసిన కలెక్టర్

06-03-2026 12:00 AM

మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశం

మణుగూరు, మార్చి 5 (విజయక్రాంతి) : ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే రోగులకు మెరుగైన వైద్య చికిత్స అందించాలని జిల్లా కలెక్టర్ అంకిత్  అన్నారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన కలెక్టర్  గురువారం పట్టణంలోని ఏరియా వంద పడకల ప్రభుత్వ ఆస్పత్రిని  తనిఖీ చేశారు. ఆకస్మికంగా కలెక్టర్ రావడంతో ఆస్పత్రి సిబ్బంది ఒకింత ఆశ్చర్యానికి గురయ్యరు. ఆస్పత్రిలోకి అడుగుపెడుతూనే కలెక్టర్ అక్కడున్న రోగులను, వారి వెంట వచ్చిన సహాయకులను పలకరించారు. వార్డులను పరిశీలించి, రోగులకు అందు తున్న సేవలపై ఆరా తీశారు.

ఎమర్జెన్సీ వార్డులో వైద్య చికిత్సల గురించి అడిగి తెలుసుకున్నారు. ఇక్కడ డాక్టర్లు ఎలా చూస్తున్నారు,వైద్య చికిత్సలు మంచిగా అందుతున్నాయా.. మందులన్నీ ఆస్పత్రి లోనే ఇస్తున్నారా, ఆస్పత్రి సిబ్బంది ఎవరైనా మిమల్ని డబ్బులు అడుగుతున్నారా,అని స్వయంగా రోగులను పలకరించి మరీ అడిగి తెలుసుకున్నారు.  ఆసుపత్రి లో అన్ని విభాగాలను పరిశీలించి వైద్యులతో మాట్లాడారు. ఆసుపత్రిలో సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని  సూచించారు.

ఆసుపత్రిలో సిబ్బంది వివరాలు, వైద్యుల వివరాలు తెలుసుకున్నారు. ప్రతిరోజు ఓపీకి ఎంత మంది వస్తున్నారు అని ఆరా తీశారు. వైద్య సిబ్బంది రోగులకు అందు బాటులో ఉండి సేవలందించాలని విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని  హెచ్చరించారు. కలెక్టర్ వెంట ఆసుపత్రి సూపరింటెండెంట్ సునీల్, వైద్యులు, సిబ్బంది తదితరులు ఉన్నారు.