03-12-2025 12:00:00 AM
యథేచ్ఛగా ప్రహారీ నిర్మాణం
గుమ్మడిదల, డిసెంబర్ 2 :గుమ్మడిదల మున్సిపాలిటీ బొంతపల్లి వార్డులో అనేక పరిశ్రమలు ఉన్నప్పటికీ వయాన్ ఎయిర్ కంట్రోల్స్ పరిశ్రమ యజమాన్యం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుంది. గతంలో 261 సర్వేనెంబర్ గల ప్రభుత్వ భూమి కోసం పరిశ్రమ యజమాన్యంతో గ్రామస్తులు మాట్లాడి ఖాళీ స్థలాన్ని వదిలి పెట్టారు.
అయితే దానిని కొందరు ఆన్లైన్ లో లేకుండా వారి పేర్ల పైన రిజిస్ట్రేషన్ చేసుకొని ఇళ్ల నిర్మాణాలు చేశారు. దానికోసం గ్రామస్తులు గ్రామ పంచాయతీ గ్రామసభలో మాట్లాడి సర్వేలు చేయించి హద్దు బందులు నిర్మించాలని ఎంపీడీవోను కోరారు. కాగా గుమ్మడిదల మున్సిపాలిటీ కావడంతో ఎంపీడీవో నాకు సంబంధం లేదంటున్నారు.
గ్రామ రోడ్డులో గతంలో మహనీయుల విగ్రహాలు పెట్టుకోవచ్చని తీర్మానించగా ఆ ఖాళీ స్థలం నుండి ఎలాంటి అనుమతులు లేకుండా ఇష్టానుసారంగా కంపెనీ గేట్లను నిర్మించారు. ఇదేమిటని పరిశ్రమ యజమానులను ప్రశ్నిస్తే ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని దురుసుగా మాట్లాడుతున్నట్లు గ్రామస్తులు ఆరోపించారు. ఇప్పటికైనా సర్వేనెంబర్ 261 గల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకొని వయాన్ ఎయిర్ కంట్రోల్ పరిశ్రమ యజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.