23 June, 2026 | 10:08 PM

Breaking News

గజ్వేల్ స్పోర్ట్స్ హబ్‌కు 27 ఎకరాలు కేటాయించాం   •   ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరగాలి   •   బీఎల్ఓ సర్ అవగాహన సదస్సును పాల్గొన్న ప్రభుత్వ సలహాదారులు   •   ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకుందాం – ప్రైవేట్ పాఠశాలల ఆర్థిక దోపిడీని అరికడదాం: ఏబీవీపీ   •   కార్పొరేట్లకు రాయితీలు సామాన్యులపై భారాలు: సిపిఎం   •   వీబీజీ రామ్ జి చట్టాన్ని రద్దు చేసి గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పునరుద్ధరించండి   •   28న పల్స్ పోలియో విజయవంతం చేయాలి   •   ఎబీవీపీ ఆధ్వర్యంలో పాఠశాలల బంద్ విజయవంతం   •   గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు   •   రెవెన్యూ ఇన్స్పెక్టర్ పనితీరు భేష్..   •  

రాజోలి కౌంటింగ్ కేంద్రంలో కలెక్టర్ పరిశీలన

15-12-2025 12:17 AM

అలంపూర్, డిసెంబర్ 14: రెండవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు పూర్తి శాంతియుత వాతావరణంలో సజావుగా నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ బి.యం.సంతోష్ తెలిపారు.ఆదివారం రాజోలి మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రాన్ని ఎస్పీ శ్రీనివాసరావు తో కలిసి కలెక్టర్ లెక్కింపు ప్రక్రియను పరిశీలించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కౌంటింగ్లో పారదర్శకత, ఖచ్చితత్వం అత్యంత ముఖ్యమని అన్నారు.

ముందుగా పోస్టల్ బ్యాలెట్ పత్రాలను లెక్కించి, తరువాత వార్డ్ మెంబర్ బ్యాలెట్ పేపర్లను వేరుచేసి క్రమపద్ధతిలో ఓట్లను లెక్కించాలని అధికారులను ఆదేశించారు.అన్ని వార్డుల లెక్కింపులు పూర్తయ్యాక సర్పంచ్ బ్యాలెట్ పత్రాలను కలిపి అభ్యర్థుల వారీగా లెక్కించాలని స్పష్టంగా సూచించారు. కౌంటింగ్ కేంద్రం వద్ద భద్రతా ఏర్పాట్లు, పర్యవేక్షణ వ్యవస్థ, సిబ్బంది సమన్వయం సమర్థవంతంగా సాగుతున్నట్లు కలెక్టర్ తెలిపారు.

ఫలితాలు వెలువడిన తరువాత ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కౌంటింగ్ ప్రక్రియ  శాంతియుత వాతావరణంలో సాగుతుందని కలెక్టర్ తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎస్పీ శ్రీనివాసరావు, అదనపు ఎస్పి శంకర్, అదనపు కలెక్టర్ నర్సింగ రావు, ఇతర అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.