15-12-2025 12:18:45 AM
యాజమాన్యం హామీనిచ్చినా కిందిస్థాయి సిబ్బంది బేఖాతరు
ఆల్ఫా పాలిమర్స్ యాజమాన్యంపై చర్యలకు డిమాండ్
చేగుంట, డిసెంబర్ 14 :మెదక్ జిల్లా చేగుంట మండలం చందాయిపేట గ్రామం లో ఆదివారం నిర్వహించిన గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు అన్ని ప్రైవేట్, ప్రభుత్వ సంస్థలు తమ ఉద్యోగులకు వేతనంతో కూడిన సెలవు ఇవ్వాల్సి ఉండగా గ్రామంలో ఉన్న ఆల్ఫా పాలిమర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ యాజమాన్యం ఈ నిబంధనలను పూర్తిగా విస్మరించడం తీవ్ర విమర్శలకు దారితీసింది.
ఎన్నికల రోజున ఉద్యోగులకు సెలవు ఇవ్వకుండా యథావిధిగా కార్మికులతో పని చేయించుకోవడం ప్ర జాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినప్పటికీ వాటిని పట్టించుకోకపోవడం విడ్డూరం గా ఉందన్నారు. ఈ విషయంపై గ్రామంలో ఉన్న వివిధ రాజకీయ పార్టీల నాయకులు స్పందిస్తూ కంపెనీ యాజమాన్యంతో ఫోన్ ద్వారా సంప్రదింపులు జరిపారు.
ఈ సందర్భంగా కంపెనీ ఎండి స్పందించి ఎన్నికల రోజున వేతనంతో కూడిన సెలవు ఇస్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం. అయితే కంపెనీలో పనిచేస్తున్న మేనేజర్, సూపర్వైజర్, ఇంచార్జ్లు మాత్రం ఆ హామీని లెక్కచేయకుండా తాము యధావిధిగా కంపెనీ నడుపు తాం, మీరు ఏం చేసుకుంటారో మీ ఇష్టం అంటూ కార్మికులతో దురుసుగా మాట్లాడినట్లు బాధితులు తెలిపారు.
కంపెనీ యాజమాన్యం ఇచ్చిన హామీకి కంపెనీ సి బ్బంది ప్రవర్తనకు మధ్య పొంతన లేకపోవడం గమనార్హం. ఎన్నికల రోజున ఓటు హ క్కు వినియోగించుకోవడం ప్రతి పౌరుడి మౌలిక హక్కు కాగా, దాన్ని అడ్డుకునే విధం గా కార్మికులను బలవంతంగా పనికి రప్పించడం చట్ట విరుద్ధమని ఆరోపిస్తున్నారు.
ఈ ఘటనపై గ్రామస్తులు, కార్మిక సంఘాల నాయకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఆల్ఫా పాలిమర్స్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యంపై తగిన చర్యలు తీసుకోవాలని జి ల్లా ఎన్నికల అధికారులను, కార్మిక శాఖ అధికారులను కోరుతున్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలను ఉల్లంఘించిన సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై అధికార యంత్రాంగం ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సి ఉంది.