12-11-2025 12:00:00 AM
మక్తల్ నియోజకవర్గంలోని మాగనూర్ మండలం అడివి సత్యారం గ్రామ పంచాయతీ లో గల వరి కొనుగోలు కేంద్రాన్ని మంగళ వారం జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ పరిశీలించారు. కేంద్రానికి ఇప్పటి వరకు ఎన్ని క్వింటాళ్ల ధాన్యం విక్రయానికి వచ్చిందని అడిగి తెలుసుకున్నారు. సన్న రకం బియ్యం సెంటర్ లో గన్ని బ్యాగ్ ల ఎన్ని ఉన్నాయని కలెక్టర్ ప్రశ్నించగా 15 వేల బ్యాగ్స్ అందుబాటులో ఉన్నాయని నిర్వాహకులు కలెక్టర్ కు తెలిపారు.
అనంతరం కలెక్టర్ మాగనూరు మండలం అమ్మ పల్లి, వడ్వాట్, గుడే బల్లూరు అడివి సత్యారం పంచాయతీ పరిధి లోని పీ ఏ సీ ఎస్ వరి ధన్య కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఈ వారం రోజుల్లో హార్వెస్టింగ్ ఎంత ఉంటుందని అడిగి తెలుసుకున్నారు. ఎన్ని బస్తాలు ఉన్నాయని అడగగా వారానికి 5000 బ్యాగ్ ల బ్యాగులు వస్తాయని, ఒక లారీలో 800 ల బస్తాలు వస్తాయని అక్కడి సిబ్బంది తెలిపారు. రెండేసి కేంద్రాలు ఉన్న చోట కూలీలను పురమాయించాలని ఆమె సూచించారు.
గుడేబల్లురు కేంద్రం నుంచి ఇప్పటి వరకు 1776 ధాన్యం బస్తాలను మిల్లులకు తరలించడం జరిగిందని సిబ్బంది చెప్పారు. అన్ని కేంద్రాలలో తప్పనిసరిగా వివరాలను ట్యాబ్ లలో నమోదు చేయాలని, కొనుగోళ్లకు సంబంధించిన అన్ని వివరాలను రిజిస్టర్ లో నమోదు చేయాలన్నారు. ముఖ్యంగా కేంద్రాలలో రైతులకు ఇబ్బంది కలగకుండా చూడాలన్నారు. ప్రతి అధికారి స్థానికంగా ఉండాలన్నారు.
సన్న రకం బియ్యం బస్తాలపై ఎస్ అని రాయాలన్నారు. అలాగే సంచులలో ధ్యానం నింపిన తరవాత ఎర్ర దారంతో సంచులను కుట్టించాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో మాగానూరు తహసిల్దార్, ఎంపీడీఓ, సంబంధిత ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.