12-11-2025 12:00:00 AM
ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి
నవాబ్ పేట నవంబర్ 11: ప్రతి రైతు సంక్షేమ కోసం ఏర్పాటుచేసిన వరి కొనుగోలు కేంద్రాల్లోనే రైతులు ధాన్యం విక్రయించాలని జడ్చర్ల ఎమ్మెల్యే అనిల్ రెడ్డి సూచించారు. మంగళవారం మండలంలోని లింగంపల్లి, లోకిరేవ్, కొండాపూర్, రుద్రారం, కాకార్లపాడ్ గ్రామాల్లో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాలను నేడు జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ప్రారంభించారు.
అనంతరం కొండాపూర్ లో గ్రామపంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతు కష్టానికి గౌరవం దక్కేలా, ప్రతి గింజకు సరైన ధర లభించేలా ప్రభుత్వం కట్టుబడి ఉందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం రైతుల పక్షాన అంకితభావంతో పనిచేస్తోందన్నారు. ఈ వడ్ల కొనుగోలు కేంద్రాల ద్వారా రైతులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా తమ పంటను అమ్ముకునే అవకాశం లభిస్తుందన్నారు.
రైతులు తమ పంటను సమయానికి కేంద్రాలకు తరలించి తేమ శాతం, ధాన్యం నాణ్యతను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వ నిబంధనల ప్రకారం విక్రయించవలసిందిగా ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు. ప్రతి రైతు పంట ధాన్యం ఒక్క గింజ కూడా నష్టపోకుండా కొనుగోలు జరుగుతుందని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ఎఎంసీ మార్కెట్ చైర్మన్ హరి లింగం, వైస్ చైర్మన్ తులసీరాం నాయక్, డైరెక్టర్లు,మండల అధికారులు,ఐకేపీ సిబ్బంది, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు, కాంగ్రెస్ నాయకులు, రైతులు పాల్గొన్నారు.