calender_icon.png 12 November, 2025 | 6:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలి

12-11-2025 12:00:00 AM

విద్యార్థులతో కలిసి భోజనం చేసిన  పేట కలెక్టర్

నారాయణపేట, నవంబర్ 11 (విజయక్రాంతి) : విద్యార్థులకు నాణ్యతతో కూడిన రుచికరమైన మధ్యాహ్న భోజనాన్ని అందించాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ సూచించారు.  మంగళవారం ఆమె మక్తల్ పట్టణం లోని మహాత్మా జ్యోతిబా పూలె పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అదే సమయంలో పాఠశాలలో  నిర్వహిస్తున్న మౌలానా అబ్దుల్ కలామ్ ఆజాద్ జయంతి ( జాతీయ విద్యా దినోత్సవం)  వేడుకల్లో కలెక్టర్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు  అజాద్ జయంతి గురించి స్పీచ్ లు ఇచ్చారు.  అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ..  పదవ తరగతి సిలబస్  ఇప్పటివరకు ఎంత వరకు పూర్తి అయిందని విద్యార్థులను ద్వారా తెలుసుకున్నారు.  ఏ సబ్జెక్ట్ చదవడానికి  కష్టం అవుతుందని ప్రశ్నించారు. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం మెరుగైన ఫలితాలు సాధిస్తామని విద్యార్థులు తెలపగా అందులో  20 మంది విద్యార్థులు 550 పై మార్కులకు పైగా  సాధిస్తామన్నారు.

తర్వాత భోజన సదుపాయల పై కలెక్టర్ ఆరా తీశారు. రోజూ ఉదయం ఎన్ని గంటలకు లేస్తారని లేచాక ఏమి చేస్తారని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల ఫ్యూచర్ ప్లానింగ్ గురించి ఒక్కొక్కరిని అడిగారు. ఏమేమి ఆటలు ఆడతారని ప్రశ్నించారు.  స్లిప్ టెస్టులు పెడుతున్నారా? లేదా ? నాన్ వెజ్ తింటున్నారా లేదా అని, మెస్ కమిటీ ఉందా ? ఆ కమిటీ సభ్యులు ముందుగా భోజనం  రుచి చూస్తున్నారా అని విద్యార్థులతో ఆరా తీశారు.

వసతి గృహంలో ఏమైనా సమస్యలు ఉంటే చెప్పాలని విద్యార్థులకు సూచించారు. విద్యార్థులకు వండిన మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. మధ్యాహ్న భోజన నాణ్యత, రుచిని తెలుసుకునేందుకు  విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో మక్తల్ తహసిల్దార్ సతీష్ కుమార్, ఎంపీడీవో, రెవెన్యూ అధికారులు, వసతి గృహ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.