12-09-2025 12:00:26 PM
మహదేవపూర్,(విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా పలిమెల మండలం లేంకలగడ్డ గ్రామం గోదావరి సమీపంలో గురువారం రాత్రి కురిసిన భారీ వర్షానికి గొర్రెల మందా పై పిడుగు పడి 100 గొర్రెల మృతి చెందాయని గొర్రెల కాపర్లు తెలిపారు.ఈ గొర్రెలు అంబటిపల్లి గ్రామానికి చెందిన కాట్రేవుల సమ్మయ్య 20, కాట్రేవుల ఆది 20,కాట్రేవుల కత్తెరాసాల 20, కాట్రేవుల మల్లేష్ 20, కాట్రేవుల పున్నము 20, మొత్తం 100 గొర్రెలు మృతి చెందాయని ప్రభుత్వం మమ్ములను ఆదుకొనివాలని మాకు ఉన్న ఉపాధి పోవడం జరిగిందని ఉపాధి కొరకు మళ్ళీ గొర్రెలను ప్రభుత్వం ఇవ్వాలని కోరుతున్నారు.