calender_icon.png 27 December, 2025 | 3:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం వద్దు

05-05-2024 12:57:20 AM

వికారాబాద్, ఏప్రిల్ 4 (విజయ క్రాంతి) : ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం వహించకూడదని జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఓపివోల శిక్షణ కార్యక్రమానికి, ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జరు గుతున్న పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ విధానాన్ని కలెక్టర్ పరిశీలించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికలు సజావుగా సాగేందుకు పోలింగ్ విధులు నిర్వహించే సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని సూచించారు. నమ్మకంతో వెళ్లకుండా ఏదైనా అనుమానం ఉంటే ప్రొసైడింగ్ అధికారి హ్యాండ్ బుక్ చూసి సందేహాలు నివృత్తి చేసుకోవాలన్నారు. చేవెళ్ల లోక్‌సభ పో టీలో 43మంది అభ్యర్థులు ఉన్నందున 3బ్యాలెట్ యూనిట్లను కేటాయిం చమన్నారు. పోలింగ్ సామగ్రి పంపిణీతో పాటు తిరిగి అప్పగించేంత వరకు సిబ్బంది ఇక్కడే ఉండాలన్నారు.