calender_icon.png 15 September, 2025 | 3:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎల్ఆర్ఎస్ ప్రక్రియను వేగవంతం చేయాలి

12-09-2024 07:19:35 PM

వనపర్తి,(విజయక్రాంతి): ఎల్ఆర్ఎస్ ప్రక్రియను వేగవంతం చేయాలని అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ సంచిత్ గంగ్వార్ ఆదేశించారు. గురువారం అదనపు కలక్టర్ తన ఛాంబర్ లో ఎల్ఆర్ఎస్ పై  మున్సిపల్ సిబ్బందికి దిశా నిర్దేశం చేశారు.  అక్రమ లే అవుట్లు, ప్లాట్ లు వనపర్తి జిల్లాలో ఎన్ని ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎల్ఆర్ఎస్ కు  దరఖాస్తు చేసుకున్న యజమానులు ఎక్కడెక్కడ ఉన్నారు అనేది గుర్తించి నిబంధన ప్రకారం ఉన్న వాటికి రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయాలని సూచించారు. అందుకు అనుసరించాల్సిన మెళుకువలు, నిబంధనలను సిబ్బందికి అవగాహన కల్పించారు. మున్సిపల్ కమిషనర్ లు, టౌన్ ప్లానింగ్ అధికారి, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.