calender_icon.png 8 October, 2025 | 2:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మల్లికార్జున క్షేత్రంలో కలెక్టర్ ప్రత్యేక పూజలు

08-10-2025 12:46:20 AM

కొండపాక, అక్టోబర్ 7: కొండపాక మండలం మర్పడగ గ్రామంలో శ్రీ విజయ దుర్గ స్వామి తన మల్లికార్జున స్వామి క్షేత్రంలో మంగళవారం శరత్ పౌర్ణమి వేడుకలు శరత్ పౌర్ణమి వేడుకలు నిర్వహించారు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఉదయం 6 గంటల నుంచి విజయదుర్గా మాత కు విశేష పంచామృతం పలారస అభిషేకం నిర్వహించి, పట్టు వస్త్రాలతో సమర్పించారు. సిద్దిపేట జిల్లా కలెక్టర్ కే హైమావతి మల్లికార్జున స్వామిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు పూర్ణకుంభంతో కలెక్టర్ హైమావతికి స్వాగతం పలికారు.

స్వామివారి కి రుద్రాభిషేకం నిర్వహించి, మహిళలు సామూహిక లలితా సహస్రనామ స్తోత్రం నిర్వహించారు. కలెక్టర్ హైమావతి హరినాథ్ శర్మ అమ్మవారి శేష వస్త్రాలతో సత్కరించారు. అనంతరం నవావరణ హవనం, పూర్ణాహుతి నిర్వహించారు. అనంతరం అన్న ప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో మోహన కృష్ణ శర్మ, వేదవ్యాస లక్ష్మణరావు, క్షేత్ర నిర్వహణ కమిటీ సభ్యులు చీకోటి మల్లికార్జున్, రాజేంద్రప్రసాద్, మల్లేశం, అడ్డువిటల్, నరసింహారెడ్డి తదితరులుపాల్గొన్నారు.