calender_icon.png 8 October, 2025 | 2:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మంత్రి పొన్నం క్షమాపణ చెప్పాలి

08-10-2025 12:47:09 AM

  1. అహంపూరిత మాటలు అణగారిన వర్గాల ఐక్యతకు భంగం 
  2. క్షమాపణ చెప్పకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం
  3. సుప్రీం కోర్టు చీఫ్ జస్టీస్‌పై దాడియత్నాన్ని ఖండిస్తున్నాం
  4. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ

హైదరాబాద్, అక్టోబర్ 7 (విజయక్రాంతి) : - మాదిగ సామాజిక వర్గానికి చెందిన మంత్రి అడ్లూరు లక్ష్మణ్‌కుమార్‌ను అవమానించేలా వ్యాఖ్యలు చేసిన బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తక్షణమే క్షమాపణ చెప్పాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ డిమాం డ్ చేశారు. మాదిగ సామాజిక వర్గానికి చెందిన లక్ష్మణ్‌ను ఉద్దేశించి దున్నపోతు అనే మాట మాట్లాడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.

మంగళవారం ఆయన ఓయూ ఆర్ట్స్ కళాశాల ఆవరణలో మీడియాతో మాట్లాడారు.  బీసీ సామాజిక వర్గానికి చెం దిన పొన్నం ప్రభాకర్ ఇలాంటి అహంపూరిత వ్యాఖ్యల వల్ల దళితులు, బలహీన వర్గా ల మధ్య దూరం పెరుగుతుందన్నారు. ఈ విషయాన్ని అర్థం చేసుకొని జరిగిన తప్పును సరిదిద్దుకోవాలని సూచించారు. ఈ విషయాన్ని ఇప్పటికే పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్‌గౌడ్  దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు.

మంత్రి పొన్నం ప్రభాకర్ క్షమాపణ చెప్పకపోతే రాష్ర్ట వ్యాప్తంగా ఉద్యమ కార్యాచరణ తీసుకోవలసి వస్తుందని ఆయన హె చ్చరించారు. తమకు ఆత్మగౌరవమే ముఖ్యమని, ఆ విషయంలో రాజీ పడే ప్రసక్తి ఉండ దని స్పష్టం చేశారు. మైనార్టీ శాఖ లక్ష్మణ్‌కుమార్ చేతిలో ఉండగా  పొన్నం ప్రభాకర్, వివేక్ జోక్యమెందుకని,  ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కూడా పరిశీలన చేయాలని కృష్ణ మా దిగ డిమాండ్ చేశారు. 

బీసీ సంక్షేమ శాఖ లో వేరే మంత్రులు జోక్యం చేసుకుంటే  పొ న్నం ప్రభాకర్ సహిస్తాడా..? అలాగే కార్మి క శాఖలో వేరే మంత్రులు జోక్యం చేసుకుంటే వివేక వెంకట్ స్వామి ఓర్చుకుంటారా..?  అని నిలదీశారు. లక్ష్మణ్ కుమార్‌ను దూషిస్తున్న సమయంలో పక్కనే ఉన్న వివేక్ మౌ నంగా ఉండడం ఆయన దుర్మార్గమైన మనస్తత్వానికి అద్దం పడుతుందన్నారు. వివేక్‌లో దళిత స్పృహ కనుమరుగైందన్నారు. సీజేఐ గవాయ్‌పై జరిగిన దాడి యత్నాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని కృష్ణ మాదిగ తెలిపారు.