calender_icon.png 8 October, 2025 | 4:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా వీరాంజనేయ స్వామి ద్వితీయ వార్షికోత్సవం

08-10-2025 12:45:09 AM

చేగుంట, అక్టోబర్ 7 :చేగుంట మండలం చందాయిపేట గ్రామంలో ఉన్న శ్రీ వీరాంజనేయ స్వామి ద్వితీయ వార్షికోత్సవ వేడుకలు మాజీ ఎంపీటీసీ పబ్బ నగేష్ గుప్తా, ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఉదయం  గణపతి పూజ,పుణ్యహవాచనం, స్వామికి ఏకాదశ మన్యుసూక్తం, అభిషేకం, సింధూరం, ఆకు పూజ, మన్యుసూక్త హవనము, సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు, అనంతరం తీర్థ ప్రసాద వితరణ, అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.  ఈ కార్యక్రమంలో శ్రీరామ్ పండరి గుప్తా, నగేష్ గుప్తా, అచంపేట యాదగిరి, ఆనందాస్ ఆంజనేయులు, జుకంటి శోభన్, శిల బలేష్ గుప్తా, వెంకటేష్ గుప్తా, భక్తులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.