calender_icon.png 1 January, 2026 | 2:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జిల్లా అధికారులకు కలెక్టర్ ప్రశంసలు

01-01-2026 12:05:56 AM

రంగారెడ్డి, డిసెంబర్ 31( విజయక్రాంతి): ఇటీవల జిల్లా లో నిర్వహించిన  గ్రామ పంచాయతీ ఎన్నికలో భాగస్వాములైన అధికారులు సిబ్బందిని  జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. బుధవారం జిల్లా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ భవనంలోని సమావేశ మందిరంలో జిల్లా పంచాయతీ శాఖ    అధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి పాల్గొన్ని మాట్లాడారు. జిల్లాలో మూడు విడుతలో పంచాయతీ ఎన్నికలల్లో తమకు కేటాయించిన విధులను ప్రతి ఒక్కరూ బాధ్యతగా నిర్వహించి విజయవంతంగా నిర్వహించిన్నట్లు చెప్పారు.

పోలింగ్ ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో నిర్వహించడం, ఎక్కడ ఎలాంటి సమస్యలు రాకుండా కింది స్థాయి నుండి పై అధికారుల వరకు ప్రతి ఒక్కరూ ఎంతో నిబద్దతతో పని చేయడం ద్వారా ఎన్నికలను విజయవంతంగా నిర్వహించుకోవడం జరిగిందన్నారు. ఎన్నికలలో భాగస్వాములైన ప్రతి ఒక్కరినీ ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ అభినందించారు.  రాబోయే ఎన్నికలలో కూడా ఇదే విధంగా ప్రతి ఒక్కరూ పని చేయాలన్నారు. సమావేశంలో  అదనపు కలెక్టర్లు చంద్రా రెడ్డి, శ్రీనివాస్, డీఆర్‌ఓ సంగీత, జెడ్పీ సిఇఓ కృష్ణారెడ్డి, డిపిఓ సురేశ్ మోహన్  జిల్లా అధికారులు, ఎంపిడిఒలు, ఎంపిఒలు, తహసిల్దారులు, తదితరులు పాల్గొన్నారు.