01-01-2026 12:04:44 AM
మణికొండ, డిసెంబర్ 31 (విజయక్రాంతి) : సమాజ సేవలో నిరంతరం శ్రమిస్తున్న పారిశుద్ధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివని మణికొండ 20వ వార్డు మాజీ కౌన్సిలర్ కమ్మ లక్ష్మీ నాగేశ్వర రావు కొనియాడారు. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా బుధవారం మణికొండలోని తన నివాస ప్రాంగణంలో పారిశుద్ధ్య కార్మికులు, కింది స్థాయి అధికారులకు ఆయన భారీ విందు ఏర్పాటు చేశారు. సుమారు 400 మందికి పైగా సిబ్బందికి భోజనాలు వడ్డించి, వారికి నూతన సంవత్సర కానుకలు అందజేశారు.
వచ్చే ఏడాదిలో ప్రతి ఒక్కరి జీవితాల్లో మంచి జరగాలని ఈ సందర్భంగా ఆయన ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో భాగంగా 350 మందికి పైగా మహిళా పారిశుద్ధ్య కార్మికులకు చీరలు, స్వీట్ బాక్సులు పంపిణీ చేశారు. పురుష కార్మికులకు డ్రెస్ మెటీరియల్, స్వీట్ బాక్సులు అందజేశారు. అలాగే మరో 50 మంది కింది స్థాయి అధికారులకు ఫ్లాస్క్ లు, స్వీట్ బాక్సులు బహుకరించారు. తమ శ్రమను గుర్తించి ఆత్మీయంగా భోజనం పెట్టి కానుకలు అందించిన లక్ష్మీ నాగేశ్వర రావుకు కార్మికులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో చైతన్య, జగదీష్ బాబు, కె. సురేంద్రరెడ్డి, బ్రహ్మాజీ, షబ్బీర్ పాల్గొన్నారు.