01-01-2026 12:07:18 AM
శామీర్ పేట్ , డిసెంబర్ 31: మూడు చింతలపల్లి మున్సిపాలిటీ లో కాంగ్రెస్ పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేయడమే లక్ష్యం అని డిసిసి అధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్ అన్నారు. బుధవారం మూడు చింతలపల్లి మున్సిపాలిటీ నారాయణపూర్ లో మున్సిపాలిటీ అధ్యక్షుడు దోసకాయల వెంకటేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన నాయకులు , కార్యకర్తల సమావేశ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ....కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడమే తన ప్రధాన లక్ష్యమని అన్నారు.
ప్రజల సమస్యలపై నిరంతరం పోరాటం చేయడమే కాంగ్రెస్ నాయకుల బాధ్యత అని చెప్పారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏ బ్లాక్ అధ్యక్షుడు జీడిపల్లి వేణుగోపాల్ రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ మంద శ్రీనివాస్ రెడ్డి, సీనియర్ నాయకులు గోనే మహేందర్ రెడ్డి , లక్ష్మారెడ్డి, బండి జగన్నాథం, పాండు, మాజీ ఎంపిటిసిలు, సర్పంచులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.