02-08-2025 01:46:27 AM
వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి
పెబ్బేరు ఆగస్టు 1 : గడచిన పదేండ్ల పాలనలో అడుగడునా కోతలు కోసారు తప్ప పేదలకు చేసిందేమీ లేదని, మేం చెప్పాము రేషన్ కార్డు ఇస్తామని, అందుకే ఇచ్చి చూయి అతున్నామని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని సహారా వివాహ వేదిక లో ప్రభుత్వం ఆధ్వర్యంలో నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం శుక్రవారం ఏర్పాటు చేసారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి, జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి పాల్గొన్నారు.
2014 మంది నూతన లబ్దిదారులకు రేషన్ కార్డు లు పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడు తూ గత బీఆర్‌ఎస్ పాలనలో ఒక్కరికీ రేషన్ కార్డు ఇచ్చిన పాపాన పోలేదని, ఇందిరమ్మ ప్రజా పాలనలో గ్రామ గ్రామానికి ఇందిరమ్మ ఇండ్లతో పాటు, వేలాదిగా కొత్త రేషన్ కార్డులు ఇవ్వటం వల్ల గ్రామాల్లో పండగ వాతావరణం నెలకొందని అన్నారు. మా నియోజకవర్గ నాయకులు తన అభివృద్ధి తో పోటీ పడాలని అన్నారు.
రూ 300 కోట్లతో త్వరలో మరిన్ని అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. వారిదృష్టి లో అభివృద్ధి అంటే కబ్జాలకు పాల్పడటమే అని నిరూపించారు. వనపర్తి నియోజకవర్గానికి నేను ఎమ్మెల్యే ఎలాగో, కేటీఆర్ కూడా ఒక ఎమ్మెల్యే మాత్రమే అని, ఆయన స్థాయి కి ముఖ్యమంత్రి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు అని ఆయన హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి పై చర్చకు ఎక్కడైనా సిద్ధం అని అన్నారు.
మహిళా సాధికారత కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే చాలా పథకాలతో పాటు, మహిళల భాగస్వామ్యం ప్రోత్సహిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, పౌరశాఖ అధికారి విశ్వనాథ్, మార్కెట్ యార్డ్ ఛైర్ పర్సన్ ప్రమోదిని రెడ్డి, వైస్ చైర్మన్ విజయ వర్దన్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అక్కి శ్రీనివాస్ గౌడ్, గంధం రాజశేఖర్,మాజీ సర్పంచ్ అక్కి సుశీల, అక్కమ్మ,
కారుపాకుల వెంకట్రాములు, దయాకర్ రెడ్డి, సురేంద్ర గౌడు, మాపర్ల రాంరెడ్డి, వెంకటేష్ సాగర్, షకీల్, వేణుగోపాల్, రాములు యాదవ్, రంజిత్, మాజీ ఎంపీపీ పద్మావతమ్మ, రమణ, లతో పాటు తహశీల్దార్ లు, మాజీ సర్పంచ్ లు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.