25 July, 2026 | 5:15 PM

Breaking News

టిఐసిసిఐ రాష్ట్ర మీడియా, సాంస్కృతిక విభాగ రాష్ట్ర కో-ఆర్డినేటర్‌గా రామావత్ నాగేంద్ర నాయక్ నియామకం   •   సర్ ప్రక్రియలో పారదర్శకతకు రాజకీయ పార్టీల సహకారం కీలకం   •   అభివృద్ధి పనులకు నిధులు మంజూరు   •   డిసిసి అధ్యక్షుడుపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు   •   కోటగుళ్లలో ఘనంగా తొలి ఏకాదశి పూజలు   •   బిజెపి యువమోర్చా ఘట్‌కేసర్ డివిజన్ అధ్యక్షుడిగా సూర్వి అనిల్ గౌడ్   •   జిల్లా జన గణన హ్యాండ్ బుక్ ప్రమాణాలకు అతిథంగా తీర్చిదిద్దాలి   •   జాతీయ ఓబీసీ సభలు జయప్రదం చేయండి   •   కాటారం మోడల్ సోలార్ విలేజ్ పనులు వేగవంతం చేయాలి   •   హైకోర్టు న్యాయమూర్తులకు స్వాగతం పలికిన కలెక్టర్   •  

జిల్లా జన గణన హ్యాండ్ బుక్ ప్రమాణాలకు అతిథంగా తీర్చిదిద్దాలి

25-07-2026 04:42 PM

జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్

కామారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా జనగణన హ్యాండ్‌బుక్ తయారీలో నాణ్యత, ఖచ్చితత్వానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్, ప్రధాన జనగణన అధికారి ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. శనివారం కామారెడ్డి కలెక్టరేట్లో నిర్వహించిన సమావేశంలో జిల్లా జనగణన హ్యాండ్‌బుక్  తయారీ ప్రక్రియలో ప్రతి దశను అత్యంత బాధ్యతాయుతంగా నిర్వహిస్తూ, సమాచార సేకరణలో నాణ్యత, ఖచ్చితత్వం, పారదర్శకతను పాటించాలని జిల్లా కలెక్టర్ అన్నారు.

 కామారెడ్డి కలెక్టరేట్‌ లో క్షేత్రస్థాయి సిబ్బందికి నిర్వహించిన ప్రత్యేక శిక్షణా కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.జిల్లా జనగణన హ్యాండ్‌బుక్ జిల్లా సామాజిక, ఆర్థిక, భౌగోళిక, పరిపాలనా వివరాలకు ప్రామాణిక ఆధార గ్రంథంగా ఉపయోగపడుతుందని తెలిపారు. అందువల్ల ప్రతి సమాచారాన్ని సంబంధిత రికార్డులతో సరిపోల్చి, ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా నమోదు చేయాలని సూచించారు. శిక్షణలో అందించిన మార్గదర్శకాలను క్షేత్రస్థాయి సిబ్బంది పూర్తిగా అవగాహన చేసుకుని, వాటిని క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేయాలని అన్నారు,

రెవెన్యూ, ప్రణాళిక తదితర శాఖలతో సమన్వయం చేసుకుంటూ నిర్ణీత గడువులోగా నివేదికలను సమర్పించాలని ఆదేశించారు. నాణ్యమైన సమాచారంతో జిల్లా జనగణన హ్యాండ్‌బుక్‌ను సకాలంలో సిద్ధం చేయడం ప్రతి అధికార బాధ్యత అని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్  విక్టర్, హైదరాబాద్‌కు చెందిన జనగణన అధికారి రమణ, సి.పి.ఓ రఘునందన్, సూపరింటెండెంట్ రాజేశ్వర్ తదితరులు పాల్గొని, సిబ్బందికి సాంకేతిక అంశాలపై అవగాహన కల్పించి అవసరమైన సూచనలు చేశారు.