డిసిసి అధ్యక్షుడుపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు
25-07-2026 04:49 PM
కుబీర్,(విజయక్రాంతి): ఖానాపూర్ ఎమ్మెల్యే డిసిసి అధ్యక్షులు వెడమ బోజుపటేల్ పటేల్ దేశ ప్రధాని నరేంద్ర మోడీ పై చేసిన వాక్యాలను నిరసిస్తూ జిల్లా వ్యాప్తంగా బిజెపి నాయకులు కార్యకర్తలు ఆందోళన చేశారు. దేశ ప్రధాని అవమానపరిచే విధంగా వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని నిర్మల్ జిల్లాలోని ఖానాపూర్ మామడ లక్ష్మణ్ చందా కుబీర్ బాసర దగ్గర పోలీస్ స్టేషన్లో బిజెపి నాయకులు ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు సాయినాథ్ పటేల్ కార్యకర్తలు ఉన్నారు.






