బిజెపి యువమోర్చా ఘట్‌కేసర్ డివిజన్ అధ్యక్షుడిగా సూర్వి అనిల్ గౌడ్
ఘట్ కేసర్,(విజయక్రాంతి): భారతీయ జనతా పార్టీ యువమోర్చా ఘట్‌కేసర్ 6వ డివిజన్ అధ్యక్షుడిగా సూర్వి అనిల్ గౌడ్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాలుగా యువమోర్చా ఉపాధ్యక్షుడిగా పార్టీ బలోపేతం కోసం పనిచేసిన నా సేవలను గుర్తించి డివిజన్ అధ్యక్షుడి బాధ్యతను అప్పగించడం నాకు ఎంతో గౌరవంగా, ఆనందంగా ఉందన్నారు.
పార్టీ నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, యువమోర్చా కార్యకర్తలతో కలిసి మరింత అంకితభావంతో పనిచేస్తూ పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు నిరంతరం కృషి చేస్తానని తెలియజేశారు. ఈసందర్భంగా ఘట్‌కేసర్ డివిజన్ బిజెపి అధ్యక్షులు కొమ్మిడి మహిపాల్ రెడ్డికి, మేడ్చల్ రూరల్ జిల్లా బిజెపి అధ్యక్షులు బుద్ది శ్రీనివాస్, బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏనుగు సుదర్శన్ రెడ్డి, మేడ్చల్ రూరల్ జిల్లా బీజేపీ యువమోర్చా అధ్యక్షులు రాగం అర్జున్ లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తెలియజేస్తున్నాను.






