జాతీయ ఓబీసీ సభలు జయప్రదం చేయండి
25-07-2026 04:38 PM
భైంసా,(విజయక్రాంతి): దేశంలో ఓబీసీ హక్కుల సాధన కోసం వచ్చే నెల 7న బెంగళూరులో ఓబీసీ 11వ మహాసభలు నిర్వహిస్తున్నట్లు జిల్లా కన్వీనర్ అనుముల భాస్కర్ తెలిపారు. శనివారం మహాసభ పోస్టర్లను ఆవిష్కరించారు. దేశంలో ఓబీసీల కు రాజ్యాంగపరమైన రిజర్వేషన్లు ఇతర డిమాండ్ల సాధన కోసం ఈ మహాసభ నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఓబీసీ నాయకులు పాల్గొన్నారు.






