మండల సర్వసభ్య సమావేశంపై కలెక్టర్ సమీక్ష
పెద్దపల్లి, ఆగస్టు 6 (విజయ క్రాంతి): ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు క్షేత్రస్థాయిలో పనిచేస్తూ బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష స్పష్టం చేశారు. గ్రామాల్లో అ వసరమైన అభివృద్ధి పనులను గుర్తించి అం చనాలు సిద్ధం చేసి వెంటనే ప్రతిపాదనలు పంపాలని అధికారులను ఆదేశించారు. ముత్తారం ఎంపీడీవో కార్యాలయంలో గురువా రం నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశంలో కలెక్టర్ వివిధ శాఖల పనితీరును స మీక్షించారు.
వ్యవసాయం, విద్య, వైద్యం, తా గునీరు, ఐసీడీఎస్, పంచాయతీరాజ్ ఇంజినీరింగ్, నీటిపారుదల, విద్యుత్, ఉద్యాన వనం, రవాణా, ఆర్ అండ్ బీతో పాటు వీబీజీరామ్జీ పనుల పురోగతిపై అధికారులతో స మీక్ష నిర్వహించారు.ఈ సమావేశంలో ప్రజాప్రతినిధులు లేవనెత్తిన సమస్యలను క్షేత్రస్థా యిలో పరిశీలించి తక్షణ చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు అధికారులు గ్రామాల్లో తరచూ పర్యటించాలని ఆదేశించారు.
మిషన్ భగీరథ గ్రిడ్, ఇంట్రా పైప్లైన్ వ్యవస్థలో ఉన్న లోపాలపై సమగ్ర నివేదిక సిద్ధం చేసి, అవసరమైన నిధుల కోసం కా ర్యాచరణ ప్రణాళిక రూపొందించాలని సూ చించారు. విద్యుత్ అంతరాయాలు తలెత్తకుండా దెబ్బతిన్న ట్రాన్స్ఫార్మర్లను వెంటనే మరమ్మతు చేయడంతో పాటు అవసరమైన చోట కొత్త ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.వ్యవసాయ శాఖ రైతులకు ఆయిల్పామ్ సాగుపై విస్తృత అవగాహన కల్పించాలని, యూరియా సరఫరా పకడ్బందీగా జరిగేలా చర్యలు తీసుకో వాలని పేర్కొన్నారు.
రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించి సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని సూచించారు. ప్ర భుత్వ ఆసుపత్రుల్లో నాణ్యమైన వైద్య సేవ లు అందేలా అన్ని రకాల మందులు అందుబాటులో ఉంచాలని, వైద్యులు సమయపాలనతో విధులు నిర్వహించాలని ఆదేశించా రు.
వీబీజీరామ్జీ పథకం కింద చేపడుతున్న జలసిరి కార్యక్రమంలోని ఇంకుడు గుంతలు, పంటకుంటలు తదితర అభివృద్ధి పనులను నిర్దేశిత గడువులో పూర్తి చేసి ప్రజలకు ప్రయోజనం చేకూరేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులకు స్పష్టం చేశారు.ఈ సమావేశంలో మండల ప్రత్యేక అధికారి ఎం. రవీందర్, ఎంపీడీవో ఐ. ప్రవీణ్ కుమార్, తహసీల్దార్ మధుసూదన్ రెడ్డి, వివిధ శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.






