24 August, 2026 | 11:59 AM

విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలి

22-05-2024 12:11 AM

హనుమకొండ, మే 21 (విజయక్రాంతి): ఎమ్మెల్సీ ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించాలని హనుమకొండ కలెక్టర్ సిక్తా పట్నాయక్ సూచించారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశం మందిరంలో ఎమ్మెల్సీ  ఉప ఎన్నిక నిర్వహణపై పీఓ, ఏపీఓ, ఇతర ఎన్నికల సిబ్బందికి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పోలింగ్ రోజున ఎలాంటి సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. 26న హనుమకొండ కేడీసీ కళాశాలలో ఎన్నికల సామగ్రి పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు రాధిక గుప్తా, వెంకట్ రెడ్డి, ఆర్డీవోలు డాక్టర్ కే నారాయణ, వెంకటేశ్, తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.