సీపీఆర్‌తో ప్రాణాన్ని కాపాడొచ్చు
కామారెడ్డి, మే 21 (విజయక్రాంతి): గుండెపోటు వచ్చినప్పుడు సీపీఆర్ (కార్డియోపల్మనరీ రెససిటేషన్) చేసి మనిషి ప్రాణాన్ని కాపాడొచ్చని ఎస్పీ సింధూ శర్మ అన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణ, సీపీఆర్ చికిత్స, రక్తదానంపై మంగళవారం సదాశివనగర్ మండలం మల్లన్నగుట్ట వద్ద పోలీస్ అధికారులకు, స్థానికులకు నిర్వహించిన అవగాహన సదస్సులో ఆమె పాల్గొని మాట్లాడారు. రోడ్డు ప్రమాదాల బారినపడకుండా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని, ట్రాఫిక్ రూల్స్ పాటించాలని తెలిపారు. అలాగే గుండెపోటుకు గురైన వారికి వైద్య సాయం అందేలోపు మనమే సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడొచ్చని అన్నారు. ఆరోగ్యవంతులైన ప్రతి ఒక్కరు రక్తదానం చేసి ఆప దలో ఉన్నవారిని ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ట్రెయినీ ఐపీఎస్ కాజల్, ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాస్, రెడ్‌క్రాస్ సొసైటీ చైర్మన్ రాజన్న, సీఐ సంతోష్ కుమార్, పోలీసుతో పాటు స్థానికులు పాల్గొన్నారు.






