calender_icon.png 11 November, 2025 | 3:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిరుద్యోగ యువతకు ఉద్యోగాల కల్పనకే మెగా జాబ్ మేళా

11-11-2025 12:00:00 AM

- పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు

- విజయవంతంకోసం విస్తృత ప్రచారం కల్పించాలని పిలుపు

- ప్రచార పోస్టరు విడుదల

మణుగూరు,నవంబర్ 10, (విజయక్రాంతి) : నియోజకవర్గంలో గల గ్రామీణ ప్రాంతం లోని నిరుద్యోగ యువతీ, యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకే మెగా జాబ్ మేళాను నిర్వహిస్తున్నట్లు పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు తెలిపారు. సోమవారం పట్టణంలోని ఎంఎ ల్‌ఏ క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సింగరేణి సహకారంతో ఈ నెల 19 న పివి కాలనీలోని భద్రాద్రి స్టేడియంలో మెగా.జాబ్ మేళా నిర్వహిస్తున్నా మని, ఈ ప్రాంత నిరుద్యోగ యువతకు ఉ ద్యోగ అవకాశాలు కల్పించాలానే సదుద్దేశం తో చేపట్టిన ఈ ప్రయత్నానికి అన్నీ రాజకీయ పార్టీలు, కుల సంఘాలు, స్వచ్ఛందసేవసంఘాలు కలిసి రావాలని పిలుపు నిచ్చా రు.

ఈ జాబ్ మేళాకు వంద కి పైగా కంపెనీలు హాజరవుతున్నాయని చెప్పారు. జాబ్ మేళాలో నాలుగు వేలకు పైగా అవకాశాలు కల్పించడం జరుగుతుందన్నారు. సింగరేణి సీ అండ్ ఎండి బలరాంను కలిసి చేసిన విజ్ఞప్తితో వెంటనే స్పందించి మణుగూరులో జా బ్ మేళా నిర్వహించేందుకు ఒప్పుకోవడం జ రిగిం దన్నారు. నిరుద్యోగులకు ఉపాధి కల్పనకు కాంగ్రెస్ ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉందని పేర్కొన్నారు. నిరుద్యోగ సమస్య పరిష్కారమే సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కల తొలి ప్రాధాన్యతని స్పష్టం చేశారు. గతంలో ఎన్నడూ లేని రీతిలో తొలిసారిగా మణుగూరులో జాబ్ మేళా ఏర్పా టు చేశామన్నారు.

10వ తరగతి ఉత్తీర్ణత సా ధించిన వారు మొదలు ఐటీఐ, డిప్లొమా, ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ, గ్రాడ్యూయేషన్, పోస్టుగ్రాడ్యుయేట్, బీఈ, బీటెక్, ఎంటెక్  త దితర ప్రొఫెషనల్ కోర్సులు చదివిన వారం తా ఉద్యోగాలు పొందాలని ఎమ్మెల్యే పా యం ఆకాంక్షిం చారు. జాబ్ మేళా నిరుద్యోగల పాలిట వరంగా మారుతుందని పేర్కొన్నారు. ఈ జాబ్ మేళాకు హాజరయ్యేందుకు రిజిస్ట్రే షన్ చేయించుకోవాలని, క్యూ ఆర్ కో డ్ ద్వారా ఆన్లైన్లోనూ నమోదు చేసుకో వచ్చన్నారు. అలా వీలుకాకపోతే 19వ తేదీ ఉదయమే స్పాట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. అభ్యర్థి కనీసం ఐదు కంపెనీ ల్లో ఇంటర్వ్యూ ఇచ్చేలా టోకెన్ పాస్కు ఏ ర్పాట్లు చేస్తున్నారన్నారు.

ఆయా కంపెనీలు నియామక, ఒప్పంద పత్రాలను అక్కడికక్కడే అందిస్తారని ఆయన తెలిపారు. జాబ్ మేళా విజయ వంతం కోసం నియోజకవర్గంలోని అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు, సిబ్బంది విస్తృత ప్రచారం చేయాలని కోరా రు.19వ తేదీన ఉదయం 8 గంటల 30 ని మిషాల నుండి సాయంత్రం 5 గంటల వర కు జాబ్ మేళా కార్యక్రమం నిర్వహించడం జరుగు తుందని, జాబ్ మేళాకు వచ్చే నిరు ద్యో గులకు సింగరేణి ఆధ్వర్యంలో భోజన ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు.

జాబ్ మేళా కార్యక్రమం విజయవంతానికి సింగరే ణి సంస్థ అన్ని ఏర్పాట్లు చేస్తుందని ఎమ్మెల్యే చెప్పారు. అనంతరం ప్రచార పోస్టరును సింగరేణి అధికారులతో కలిసి ఎమ్మెల్యే విడుదల చేశారు. ఈ విలేకరుల సమావేశంలో ఏరియా ఎస్వోటూ జీఎం శ్రీనివాస చారి, డీజీఎం పర్సనల్ రమేష్, వెంకటరమణ, ఎంపీఓ వెంకటేశ్వరరావు, మున్సిపల్ కమిషనర్ ప్రసాదరావు,  మండల, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు పీరి నాకి నవీన్,బోనగిరి సైదులు, ఇక్బాల్ హుస్సేన్, తరుణ్ రెడ్డి, సౌజన్య, గాండ్ల సురేష్,పాల్గొన్నారు.