04-09-2025 12:53:46 AM
ఇంచార్జి అధికారుల నియామకం
కామారెడ్డి, సెప్టెంబర్ 3 (విజయక్రాంతి) ః ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం కామారెడ్డి జిల్లా లోని పలు ప్రాంతాలను పరిశీలించ నున్నారు. జిల్లా కలెక్టర్ ఆశిష్ సంఘవన్ జిల్లా ఎస్పీ రాజేష్ చంద్రలు బుధవారం పర్యటించారు. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం ఎర్రపాడు వద్ద ముఖ్యమంత్రి హెలికాప్టర్ దిగేందుకు హెలీ ప్యాడ్ ఏర్పాట్లను పరిశీలించారు. ఇన్చార్జిలిగా కామారెడ్డి ఆర్డీవో వీణ, కామారెడ్డి తాసిల్దార్ జనార్ధన్, తాడ్వాయి తాసిల్దార్లకు సూచించారు.
అనంతరం లింగంపేట మండలంలో దెబ్బతిన్న లింగంపల్లి కుర్దు వంతెనను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశీలించనున్నారు. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. అక్కడి నుంచి వరద తాకిడికి దెబ్బతిన్న బ్రిడ్జిలను చూపించను న్నారు. ఎల్లారెడ్డి ఆర్ డి ఓ పార్థసింహారెడ్డి డ్యామేజ్ అయిన కల్వర్ట్లను పరిశీలించే విధంగా ఇన్చార్జిగా నియమించారు.
అనంతరం కామారెడ్డి పట్టణంలోని జి.ఆర్ కాలనీలో వరద బాధితుల ను ఓదార్చేందుకు ముఖ్యమంత్రి వస్తున్నందున ఏర్పాట్లను పరిశీలించారు. కలెక్టరేట్లో ముఖ్య మంత్రి జిల్లా అధికారులతో వాదలపై సమీక్ష ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాట్లను పరిశీలించి ముఖ్య మంత్రి కార్యక్రమం సాఫీగా జరిగేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ఆశిష్ సంఘ వాన్ ఆదేశించారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.