calender_icon.png 12 September, 2025 | 12:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆ పరికరాలకు మరమ్మతులు చేయించండి

04-09-2025 12:52:40 AM

  1. ఎనిమిదేళ్లు దాటిన వాటికి స్క్రాప్ వేయండి  
  2. ఆరోగ్యశాఖ అధికారులకు మంత్రి రాజనర్సింహ ఆదేశం

హైదరాబాద్, సెప్టెంబర్ 3 (విజయక్రాంతి): ప్రభుత్వాస్పత్రుల్లోని ఎమర్జెన్సీ ఎక్విప్ మెంట్‌లను వెంటనే బాగు చేయించాలని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజ నర్సింహ అధికారులకు ఆదేశించారు. బుధవారం హైదరాబాద్‌లోని రాజీవ్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ కార్యాలయంలో ఆరోగ్య శాఖ పనితీరుపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వ హించారు. ప్రభుత్వాస్పత్రుల్లో మౌలిక సదుపాయాల కల్పనపై చర్చించారు.

ప్రభుత్వ హాస్పిటల్‌లలో భాగంగా గాంధీ ఆస్పత్రిలోని ప్రజలకు అందుతున్న వైద్య సేవలు, వసతు లతోపాటు ఇతర ప్రభుత్వాస్పత్రుల్లో  శానిటేషన్, ఆపరేషన్ థియేటర్లు ఏర్పాటు, ఎక్విప్ మెంట్ వినియోగంపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఎమర్జెన్సీ ఎక్విప్‌మెంట్‌లను వెంటనే రిపేర్లు చేయాలని మంత్రి ఆదేశించారు.

ఎనిమిదేళ్లు దాటిన ఎక్విప్ మెంట్‌లను స్క్రాప్ చేయాలన్నారు. ఆస్పత్రికి వచ్చే రోగుల సహాయకుల కోసం ఐదు అంతస్తులతో సీఎస్‌ఆర్ నిధులతో సౌకర్యవంతమైన భవన నిర్మాణంపై చర్చించారు. ఈ సమీక్షలో హెల్త్ సెక్రటరి డా. క్రిస్టినా జెడ్ చోంగ్తూ , హెల్త్ కమిషనర్ సంగీత సత్యానారాయణ , టీజీఎంఎస్‌ఐడీసీ ఫణింద్రరెడ్డి, ఆరోగ్యశ్రీ సీఈవో ఉదయ్‌కుమార్ పాల్గొన్నారు.