04-09-2025 12:55:52 AM
బాధితులకు అండగా నిలుస్తోంది
రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ
కామారెడ్డి, సెప్టెంబర్ 3 (విజయక్రాంతి) ః కామారెడ్డి వరద బాధితులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం పరామర్శించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ తెలిపారు. బుధవారం సాయంత్రం జీ ఆర్ కాలనీ, హౌసింగ్ బోర్డ్ కాలనీ, కౌండిన్య ఎంక్లేవ్ ప్రాంతాలను పరిశీలించారు. బాధితులను కలిసి మాట్లాడారు. బాధితులకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని షబ్బీర్ అలీ బాధితులకు భరోసా కల్పించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చి బాధితు లను పరామర్శిస్తారని తెలిపారు.
జిల్లాలో వరద తాకిడికి తెగిపోయిన రోడ్లు, బాధితులను పరామర్శించి అధికారులతో సమీక్ష నిర్వహిస్తారని షబ్బీర్ అలీ తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు కైలాస్ శ్రీనివాసరావు, మాజీ జెడ్పిటిసి నిమ్మమోహన్ రెడ్డి, మాజీ సి డి సి చైర్మన్ కారంగుల అశోక్ రెడ్డి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు పండ్లరాజు, కాంగ్రెస్ నాయకులు గూడెం శ్రీనివాస్ రెడ్డి, పున్న రాజేశ్వర్, గొడుగుల శ్రీనివాస్, పుట్నాల శ్రీనివాస్ యాదవ్, గణేష్, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.