calender_icon.png 16 October, 2025 | 5:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘మామూలు’ పటాకులు..?

16-10-2025 01:42:51 AM

  1. నిబంధనలు ఉల్లంఘించి దుకాణాల ఏర్పాటు

అధికారులను మంచి చేసుకున్న వ్యాపారులు 

ఉమ్మడి జిల్లాలో విక్రయాల నిబంధనలు బేఖాతర్

పోలీసులు, అగ్నిమాపక శాఖ అధికారుల ప్రత్యేక దృష్టి

ఇష్టారీతిన అధిక రేట్లకు వ్యాపారుల విక్రయాలు

దీపావళి సందర్భంగా పటాకులు దుకాణాల ఏర్పాట్లు

నిబంధనలు పాటించని వ్యాపారులపై కేసులు

కామారెడ్డి/బాన్సువాడ, అక్టోబర్ 15 (విజయక్రాంతి) : దీపావళి వేడుకలకు టపాసుల విక్రయా జోరుగా సాగుతాయి. టపాసుల దుకాణాలు ఏర్పడుదారులు వ్యాపా రులు నిబంధనలు ఉల్లంఘించి అధిక ధరలకు విక్రయించడమే కాకుండా కనీస భద్రత ఏర్పాట్లు చేయడం లేదు. ప్రతి సంవత్సరం అధికారులు హెచ్చరిస్తున్న వ్యాపారులు మాత్రం తమదైన రీతిలోనే దుకాణాలు ఏర్పాటు చేసి టపాకాయలను అమ్ముతున్నారు.

కోట్ల విలువ చేసే టపాకాయలను గోదాముల్లో ఎలాంటి అనుమతులు లేకుం డా నిలువ ఉంచుతున్నారు. ప్రమాదం షార్ట్ సర్క్యూట్ వల్ల జరుగుతే భారీ నష్టం వాటిల్లనుంది. అంతేకాకుండా ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరిగిన సందర్భాలు కూడా లేకపోలేదు. ఆయన అధికారులు భద్రత చర్యలు చేపట్టడంలో నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారు. ప్రతి సంవత్సరం చెప్పడమే తప్ప ఆచరణలో మాత్రం అమలు చేయడం లేదు.

కామారెడ్డి నిజాంబాద్ ఉమ్మడి జిల్లా ల్లో తపాకాయల వ్యాపారులు అధిక ధరలకు విక్రయాలు చేపడుతూ కొనుగోలు దారులకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నారు. ఏడాదికి ఒకసారి వచ్చే దీపావళి వేడుకలు ఎంతో ఘనంగా జరుపుకోవాలని ఇంటిల్లిపాది టపాకాయలు కాల్చి ఆనందోత్సవాలను జరుపుకుంటారు. అలాంటి సంప్రదాయం ఉండడంతో కొనుగోలుదారుల అవకాశాన్ని ఆసరా చేసుకుంటున్నా వ్యాపారులు సిండికేట్ గా మారి అధిక ధరలకు టపాకాయలను విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.

డబల్ త్రిబుల్ ధరలకు టపాసుల విక్రయాలు..

దీపావళి పర్వదినాన పటాకుల దుకాణాల కోసం వ్యాపారులు అప్పుడే పావులు కదుపుతున్నారు. తమ షాపులను నెలకొల్పుకునేందుకు కసరత్తు చేస్తున్నారు. పెద్ద ఎత్తున షాపులను ఏర్పాటు చేసుకొని టపాసులను అమ్ముకునే ప్రయత్నాలు మొదలు పెడుతున్నారు. అందుకు కావలసిన అనుమతుల కోసం పోటీ పడుతున్నారు. సంబంధిత శాఖల అధికారులను మచ్చిక చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు.

ఇటు పోలీస్ శాఖ, అటు అగ్నిమాపక శాఖ, రెవెన్యూ శాఖ, మున్సిపల్ శాఖ తదితర శాఖల అధికారులను కలిసి టపాసులు బాణ సంచాలను అమ్ముకునేందుకు అధికారుల ఆశీర్వాదం కోసం వెంపర్లాడుతున్నారు. మందు గుండు సామాగ్రిని విక్రయించాలంటే వ్యాపారులు తూచా తప్పకుండా నిబంధనలు పాటించాల్సిన అవసరం ఉంటుంది. ఏమాత్రం ప్రమాదం జరిగిన ప్రాణాలు పోయే పరిస్థితి ఏర్పడుతుంది.

తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటే తప్ప ప్రమాదాల నుండి తప్పించుకోవచ్చు. ప్రతి ఏటా టపాసుల దుకాణాలు ఏర్పాటు కావడం, పెద్ద మొత్తంలో అమ్మకాలు జరిగిపోవడం, వ్యాపారులు అధికంగా లాభార్జించడం ఆనవాయితీగా జరుగుతూ వస్తుంది. అందుకు సంబంధిత అధికారులు కూడా వ్యాపారులకు అనుగుణంగా వ్యవహరించడంతో ప్రమాదాలు చోటుచేసుకునే అవకాశాలు కనిపిస్తూ వస్తున్నాయి.

జనావాస ప్రాంతాల మధ్య, రద్దీగా ఉండే చౌరస్తాల వద్ద టపాసుల దుకాణాలు పెట్టడానికి ఎలాంటి అవకాశం లేదు. అలాగే కిరాణా షాపులు జనరల్ స్టోర్ లలో కూడా టపాసులు అమ్ముకునేందుకు ఎంత మాత్రం నిబంధనలు ఒప్పుకోవు. జనం కిటకిటలాడే ప్రధాన కూడళ్లలో రోడ్లపై పెట్టి పటాకులు అమ్ముకుని పరిస్థితి ఎంత మాత్రం ఉండదు. టపాసులు అమ్ముకోవాలంటే అగ్ని ప్రమాదం జరిగినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు చాలా అవసరం.

కానీ ప్రతి ఏటా దీపావళి రావడం, పటాకులు అమ్ముకోవడం, నిబంధనలను అతిక్రమించడం పరిపాటిగా మారిపోతుంది. పట్టణ శివారు ప్రాంతాల్లో మాత్రమే టపాసుల దుకాణాలు పెట్టుకునేందుకు అధికారులు అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. ఏమాత్రం ఘటన జరిగిన ప్రాణాపాయం జరగకుండా ఉండే అవకాశం కలుగుతుంది. కానీ వ్యాపారులు పట్టణ నడిబొడ్డులో జనావాస ప్రాంతాల మధ్య దుకాణాలను నెలకొల్పుకుంటున్నారు.

దీనివల్ల ఆ ప్రాంత ప్రజలు ఇప్పుడేం జరుగుతుందోనని బీతిలి పోవాల్సి వస్తుంది. దీపావళి పండుగ సంబరాలను సంతోషంగా జరుపుకునేందుకు వీలుగా నిబంధనల మెరికి పటాకుల దుకాణాలను నెలకొల్పునందుకు అవకాశం కల్పించేందుకు ఈ ఏడైనా అధికారులు తగు జాగ్రత్తలు తీసుకోవడమే కాకుండా నిబంధనలను అతిక్రమించకుండా తక్షణ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

రూల్స్ పాటించకపోతే కొరఢా ః నిజామాబాద్ సీపీ హెచ్చరిక 

టపాకాయల దుకాణాదారులు డివిజినల్ స్థాయి పోలీస్ అధికారుల అనుమతిని తప్పకుండా తీసుకోవాలని పోలీస్ కమిషనర్ వెల్లడించారు. ఈసారి దీపావళి పండుగలో టపాసులు అమ్మకం దారులు నిబంధనలు పాటించకపోతే సి పి సాయి చైతన్య హెచ్చరించారు. దీపావళి పండుగ సందర్బంగా నిజామాబాద్ పోలీస్ కమీషనరేటు పరిధిలో తాత్కాలిక టపాకాయల దుకాణాలు నెలకొల్పేవారు వారి వారి సంబంధిత డివిజినల్ పోలీస్ అధికారి కార్యాలయం నుండి ధరఖాస్తు చేసుకొని అనుమతి పత్రం పొందాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్  స్పష్టం చేశారు.

అందుకు సంబంధించిన ఇతర సమాచారం కోసం సంబంధిత డివిజినల్ స్థాయి అధికారిని సంప్రదించాలని సూచించారు.ఎవ్వరయిన సంబంధిత డివిజినల్ పోలీస్ అధికారి నుండి అనుమతి లేకుండా టపాకాయల దుకాణాలను నెలకొల్పినట్లయితే వారిపై ఎక్స్ ప్లోజివ్ యాక్టు - 1884 మరియు రూల్స్ 1933 సవరణ 2008 ప్రకారంగా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని కమిషనర్ హెచ్చరించారు.

పటాకుల షాపుల కోసం నిబంధనలు ఇవే...

టపాకాయల దుకాణాదారులు తప్పక ఈ క్రింది నిబంధనలు పాటించాలి.టపాకాయల దుకాణాలు సంబందిత ఖాళీ ప్రదేశాలలో నెలకొలుపు కోవాలి. ఖాళీ ప్రదేశానికి సంబంధించిన ఎన్.ఓ.సి సర్టిఫికేటు పొందపర్చాలి.ఒక క్లస్టర్లో 50 షాపులకు మించ కుండా ఉండాలి.జనరద్దీగల ప్రదేశాలలో ఎలాంటి టపాకాయల షాపుల ఏర్పాటు చేయరాదు.

అదేవిధంగా కళ్యాణ మండపాలలో, సమావేశాల కేంద్రాలలో టపాకాయల దుకాణాలు నెలకొల్పరాదు..తాత్కాలిక టపాకాయల దుకాణాలలో ఫైర్ కు సంబంధించిన జాగ్రత్తలు తప్పక పాటించేవిధంగా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. పూర్తివివరాలతో కూడిన దరఖాస్తు డీఎస్పీ లేదా సంబంధిత ఎ.సి.పి కార్యాలయాల్లో సమర్పించాలని సిపి ,పి ,సాయి చైతన్య సూచించారు.