1 June, 2026 | 12:59 PM

Breaking News

Formula-E race case ఈ- కార్ ఫార్ములా కేసులో త్వరలో ట్రయల్: సీఐడీ చీఫ్   •   గంజి చంద్రమౌళి మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు   •   కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు   •   మున్సిపాలిటీ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరణ   •   డంపింగ్ యార్డ్ ఏర్పాటుకు వ్యతిరేకంగా చలో కలెక్టరేట్ పాదయాత్ర ప్రారంభం   •   ఉరుమడ్ల గ్రామంలో ఎమ్మెల్యే వేముల వీరేశం జన్మదిన వేడుకలు   •   అగ్నివీర్ కు ఎంపికైన అచ్చంపేట యువకుడు   •   World Milk Day: పాల ధర తగ్గి, ఖర్చులు పెరిగి డైరీ రైతులు నష్టాల్లో   •   ఆన్‌లైన్‌ బెట్టింగ్‌పై తెలంగాణ CID బిగ్ ఆపరేషన్.. 11 మంది అరెస్ట్   •   బిగ్ షాక్... మరోసారి పెరిగిన సిలిండర్ ధరలు.. ఎంతంటే?   •  

ప్రజలందరికీ భాగస్వామ్యంతోనే కాలనీల అభివృద్ధి

13-04-2026 08:59 PM

కాలనీ వాసుల  సొంత నిధులతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు

మాజీ సర్పంచ్ శంకర్ గౌడ్

జవహర్ నగర్,(విజయక్రాంతి): ప్రజలందరికీ భాగస్వామ్యంతోనే ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని ప్రగతిలో ప్రతి పనికి ప్రభుత్వం పై ఆధారపడకుండా ప్రజలందరి భాగస్వామ్యంతో సొంత నిధులతో అభివృద్ధి చెందవచ్చునని జవహర్ నగర్ మాజీ సర్పంచ్ శంకర్ గౌడ్ తెలిపారు. మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కీసర సర్కిల్ జవహర్ నగర్ చంద్రపురి కాలనీలోని ముత్తుస్వామి కాలనీలో కాలనీవాసుల సహకారంతో సోమవారం అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను మాజీ సర్పంచ్ శంకర్ గౌడ్, మాజీ కార్పొరేటర్ నిహారిక గౌడ్ తో కలిపి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు.

ఈ గొప్ప కార్యక్రమానికి మాజీ కార్పొరేటర్ నిహారిక గౌడ్ రూ.75000 ఆర్థిక సహాయం అందించడం అభినందనీయ మనీ అలాగే తమ వంతు సహాయంగా రచన స్కూల్ ప్రిన్సిపల్ శ్రీకాంత్ రెడ్డి ఆర్థిక సహకారం తోపాటు కాలనీలోని ప్రజలందరూ కొంత మొత్తం వేసుకొని ఈ మహత్కర కార్యాన్ని చేపట్టడం శుభ సూచకమన్నారు. ప్రాంతాలు అభివృద్ధి చెందినప్పుడే ఊరు అభివృద్ధి చెందుతుందని తద్వారా దేశం పురోగాభివృద్ధిలో ముందుకు పయనిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సామాజిక సేవకుడు బూడిద వెంకటేష్, మహేందర్ యాదవ్, భాస్కర్ గౌడ్, అనిల్ ముదిరాజ్, కిషోర్, కిరణ్, రవి, కర్ణాకర్, వంశీ, విజయ్ ,రాజు పటాన్, రాము, భరత్ ,రాములమ్మ, యాదలక్ష్మి, నాగమణి, శకుంతల కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.