26 July, 2026 | 1:15 PM

'ఒక రైడ్, ఒక దేశం, ఒక సెల్యూట్'

26-07-2026 12:04 PM

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 136వ మన్ కీ బాత్ కార్యక్రమంలో జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. కార్గిల్ అమరవీరులకు ఘన నివాళులు అర్పించి,  జీవితంలో కొన్ని తేదీలను గుర్తుంచుకోవడానికి క్యాలెండర్ చూడాల్సిన అవసరం లేదని మోదీ పేర్కొన్నారు. జూలై 26 అటువంటి తేదీలలో ఒకటి అని, నేడు కార్గిల్ విజయ్ దివస్.. ఈ రోజు మనల్ని గర్వంతో నింపుతుందన్నారు. మన వీర సైనికుల అసాధారణ ధైర్యాన్ని ఇవాళ మనకు గుర్తు చేస్తుందని, మాతృభూమిని రక్షించడానికి సైనికులు సర్వస్వం త్యాగం చేశారు. 

ఈసారి ఒక ప్రత్యేకమైన 'శౌర్య విజయ్ యాత్ర'ను నిర్వహించారని, ఢిల్లీలోని నేషనల్ వార్ మెమోరియల్ నుంచి బైక్ యాత్ర నిర్వహించారని ప్రధాని వెల్లడించారు. జూలై 14న ప్రారంభమైన బైక్ యాత్ర కార్గిల్ లోని వార్ మెమోరియల్ కు చేరుకుంటుందని, 'ఒక రైడ్, ఒక దేశం, ఒక సెల్యూట్' అని మోదీ వ్యాఖ్యానించారు. దేశం కోసం చేసిన త్యాగాలను ఎప్పటికీ మరువలేమని ఈ యాత్ర మనకు గుర్తుచేస్తుందని, కొద్ది రోజుల క్రితం 'ఐఎన్ఎస్ మహేంద్రగిరి' భారత నావికాదళంలో చేరిందని మోదీ చెప్పారు. ఈ ఆధునిక యుద్ధనౌకను మన దేశంలోనే రూపకల్పన చేసి నిర్మించారని, యుద్ధనౌకలో 75 శాతానికి పైగా స్వదేశీ పరిజ్ఞానాన్ని ఉపయోగించారు. 

ఇది 'ఆత్మనిర్భర్ భారత్ శక్తికి ప్రతీక' అని, ఈ నెలలో డీఆర్డీవో 'పినాకా లాంగ్ రేంజ్ గైడెడ్ రాకెట్' ను విజయవంతంగా పరీక్షించిందని ఆయన గుర్తు చేసుకున్నారు. రెండ్రోజుల క్రితం డీఆర్డీవో 'కుషా' క్షిపణిని విజయవంతంగా పరీక్షించిందని, భారత్ నిరంతరం కొత్త శిఖరాలను తాకుతోందని, ఇండోనేషియాతో బ్రహ్మోస్ క్షిపణుల కోసం పెద్ద ఒప్పందం కుదిరిందని ప్రధాని మోదీ తెలిపారు.