calender_icon.png 20 August, 2025 | 9:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆగిపోయిన కాలనీ పనులు

20-08-2025 01:08:12 AM

ఏళ్లుగా వాయిదా పడుతున్న సమస్య

పరిస్కారం కోసం కాలనీ ఎదిరి చూపు

విష పురుగుల నుంచి మమల్ని రక్షించండి

ప్రజావాణిలో కాలనీ వాసుల వినతి

కుత్బుల్లాపూర్,(విజయక్రాంతి): కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సూరారం డివిజన్ శ్రీరాంనగర్‌లోని కార్తీక్ నేచర్ స్పేస్ కాలనీ వాసులు ఏళ్ల తరబడి మౌలిక సదుపాయాల కోసం ఎదురుచూస్తూనే ఉన్నామని, కానీ సమస్య మాత్రం పరిస్కారం కావడం లేదని, కాలనీ వాసులు సోమవారం ప్రజావాణిలో మున్సిపల్ అధికారులకి వినతి పత్రం అందజేశారు. తమ కాలనీ ఏర్పడి 10 సంవత్సరాలు కావొస్తున్న సమస్యలు మాత్రం తిష్ట విషయాని, తమ కాలానికి ప్రధానంగా వెనక వైపు ఫారెస్ట్ ల్యాండ్ ఉండడం ప్రధాన సమస్యని,

దీని కారణంగా  కాలనీకీ అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ లేకపోవడం, సీసీ రోడ్లు వేయకపోవడం కారణంగా రాత్రి వేళలో పాములు,విష జంతువుల, దోమల బెడద వంటి సమస్యలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు.వర్షాకాలంలో మురుగు నీరు వీధుల్లోకి పొంగిపోవడంతో, కాలనీ ప్రజలు బురద రోడ్లలో ప్రయాణం చేయాల్సి వస్తుందని, కాలుష్యం దుర్వాసనతో కాలనీ లో ప్రజలు శ్వాస కోస వ్యాధిన  జీవతమంతా కష్టసాధ్యంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పనులు ప్రారంభమై మధ్యలో ఆగి..

గతంలో కుత్బుల్లాపూర్ మున్సిపల్ అధికారులకు సమస్యను వివరించగా స్పందించి మున్సిపల్ నిధుల నుండి సుమారు రూ.1.80 కోట్ల పనులకు ఆమోదం లభించినప్పటికీ, కొంత మేర పని జరిగిన మధ్యలోనే ఫారెస్ట్ శాఖ అడ్డుకోవడంతో పనులు ఆగిపోయాయి.పనులు ఆగడం తో సదరు కాంట్రాక్టర్ ఆ పనులను అధికారుల ప్రమేయం తో వేరే చోట పనులు చేసి బిల్లులు రాబట్టుకున్నారని కాలనీ ప్రజలు ఆరోపిస్తున్నారు. దీంతో సమస్యకు శాశ్వత పరిష్కారం లేకుండా ఆగిపాయింది.

విష పురుగుల నుండి రక్షించండి...

కాలనీ వాసులు ప్రధానంగా కాలనీ వెనక వైపు ఫారెస్ట్ ల్యాండ్ ఉన్నందున తరచుగా పాములు, జంతువులు కాలనీలోకి రావడం ప్రజల్లో భయాందోళనలకు దారి తీస్తోంది. కాలనీకి శాశ్వత అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ ఏర్పాటు చేయాలని, సీసీ రోడ్ల నిర్మాణం,ఫారెస్ట్ ల్యాండ్ చుట్టూ ప్రహరీ గోడ నిర్మాణం చేపట్టాలని కాలనీ వాసులు కోరుతున్నారు. ప్రతి సారి కాలనీ వాసులు అందరూ కలిసి  డబ్బులు ఖర్చు చేసి తాత్కాలికంగా సమస్యలు పరిష్కరించుకోవాల్సి వస్తోందని అయినా ప్రధాన సమస్య మాత్రం పరిష్కారం కావడం లేదని తెలిపారు. ఇకనైనా మున్సిపల్ అధికారులు చొరవ చూపి ఫారెస్ట్ అధికారులతో సమన్వయము చేసి శాశ్వత పరిష్కారం చూపించి కాలనీ వాసులకి న్యాయం చేయాలని  కోరారు.

ప్రజా వానిలో పిర్యాదు...

ఆగిపోయిన కాలనీ పనులు,సత్వరమే పరిష్కరించాలని సూరారం శ్రీరాంనగర్‌లోని కార్తీక్ నేచర్ స్పేస్ కాలనీ వాసులు కుత్బుల్లాపూర్ మున్సిపల్ కార్యాలయం లో సోమవారం ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు.