20-08-2025 01:08:14 AM
మహారాష్ట్ర నుండి పోటెత్తుతున్న వరద నీరు
సీపీ సాయి చైతన్య ప్రజలకు సూచన
నిజామాబాద్ ఆగస్టు 19 (విజయ క్రాంతి) : మహారాష్ట్రలోని ఎగువ ప్రాంతం బాబ్లీ ప్రాజెక్ట్ నుంచి మహారాష్ట్రల కురుస్తున్న వర్షాల వల్ల భారీగా వరదనీరు గోదావరి త్రివేణి సంగమం లోకి వస్తున్న సందర్భంగా కందకుర్తి గోదావరి బ్రిడ్జి, పుష్కర ఘాట్లను నిజామాబాద్ సిటీ సాయి చైతన్య పర్యవేక్షించరు. మంగళవారం బోధన్ డివిజన్ పరిధిలోని రెంజల్ మండలం లోని కందకుర్తి గ్రామ సమీపంలో గల కందకుర్తి గోదావరి బ్రిడ్జి ని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, పరిశీలించిన అనంతరం సిబ్బందిని అప్రమత్తం చేశారు.
ఈ సందర్భంగా కందకుర్తి లో గల ఎగువన నిజాంసాగర్ కెనాల్ నుండి భారీగా వస్తున్న వరద ప్రవాహం వలన కందకుర్తి గోదావరి బ్రిడ్జి ను కాకి నీరు ప్రవహిస్తోంది. త్రివేణి సంగమం కందకుర్తి తో పాటు అక్కడి పుష్కర ఘాట్ ని కూడా సిపి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య మాట్లాడుతూ రానున్న రెండు, మూడు రోజులు అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సమాచారం మేరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు ఆయన సూచించారు, వరద ఉధృతి ఎక్కువగా ఉన్నందున ప్రజలు ఎవరు కూడా నీటి ప్రవాహం వద్దకు రాకూడదని ఆయన కోరారు.
అత్యవసర సమయంలో సంబంధిత రెంజల్ పోలీస్ స్టేషన్ వారిని లేదా డయల్ 100 లేదా పోలీస్ కంట్రోల్ రూమ్ 8712659700 నెంబర్ కు సంప్రదించాలని సిపి ప్రజలకు తెలిపారు. ప్రాజెక్టుల పర్యవేక్షణలో సిపి సాయి చైతన్యతో పాటు బోధన్ ఏసీపీ పి. శ్రీనివాస్, బోధన్ రూరల్ సీఐ విజయ్ బాబు, రెంజల్ ఎస్త్స్ర చంద్ర మోహన్ , మండల వ్యవసాయ అధికారి సిద్ధి రామేశ్వర్ ఏఈఓశ్రీ గోపి కృష్ణ తదితరులు ఉన్నారు.