కనులారా మహా కుంభాభిషేకాన్ని చూద్దాం.. రారండి
ఎర్రుపాలెం, జూన్ 28 (విజయక్రాంతి) :కలియుగ శ్రీ వెంకటేశ్వర డు కొలువై ఉన్న జమలాపురం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో కనులారా మహా కుంభాభిషేక కార్యక్రమాలు జరుగుతాయని ఆలయ ఈవో కొత్తూరు జగన్మోహన్రావు తెలియజేశారు. ఈ నెల 29వ తేదీ నుండి 3:7:26 వరకు జరగనున్న కుంబాభిషేకం , ధ్వజస్తంభ ప్రతిష్టా కార్యక్రమాలను విజయవంతం చేయాలని దేవస్థానం ఈవో పేర్కొన్నారు. దేవస్థానంలో జరిగే కార్యక్రమాలను ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభిస్తారని పేర్కొన్నారు.
దేవస్థానంలో స్వామివారి విగ్రహ ప్రతిష్ట జరిగి 50ఏండ్లు పూర్తయిన సందర్భంగా ఈ కార్యక్రమాలను జరుపుతున్నట్లు పేర్కొన్నారు. ఆలయంలో జరిగే కార్యక్రమాలకు శృంగేరి శారద పిఠాధిపతి శ్రీశ్రీశ్రీ విధిశేఖర భారతి హాజరవుతారని పేర్కొన్నారు. స్వామివారి ఆలయ ప్రాంగణంలోని పద్మావతి అమ్మవారు, అలివేలు మంగ, శివాలయంలో నూతన ధ్వజస్తంభన ప్రతిష్ట, మహాకుంభాభిషేకం నిర్వహిస్తున్నందున భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించామని పేర్కొన్నారు.
ప్రతిరోజు మహాఅన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తు న్నట్లు వివరించారు. దేవాలయంలో జరిగే కార్యక్రమాలను శ్రీ వకుల మాత స్టేడియం నిర్మాణదాత జమలాపురం సర్పంచ్ తుళ్లూరి నిర్మలా కుమారి, కోటేశ్వరరావు దంపతుల సహాయ సహకారాలతో నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. దేవాలయం లో జరిగే కార్యక్రమాలకు భక్తులు తరలివచ్చి శ్రీవారిని దర్శించి శ్రీవారి కృపకు పాత్రులు కాగలరని పేర్కొన్నారు.






