జనసంద్రంగా యాదగిరి క్షేత్రం
ధర్మ దర్శనానికి మూడు, ప్రత్యేక దర్శనానికి రెండు గంటలు
యాదగిరిగుట్ట, జూన్ 28 (విజయకాంతి): ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకు నేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి వేల సంఖ్యలో భక్తుల తరలివచ్చారు. ఆదివారం సెలవు కావడంతో యాదగిరి కొం డ భక్తులతో నిండి సందడిగా మారింది. వాహనాల రద్దీ పెరగడం కొండపైకి అనుమతించలేదు. ముసురు వర్షంలోనే భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు.
కొండకింద రింగ్ రోడ్డు వాహనాలతో కిక్కిరిసింది. మాడవీధులు భక్తులతో కిటకిటలాడాయి. ధర్మ దర్శనానికి మూడు గంటలు, స్పెషల్ దర్శ నానికి రెండు గంటల సమయం పట్టింది. భక్తుల రద్దీని దృష్టి లో ఉంచుకొని ఆలయాధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. స్వామి వారి దివ్య క్షేత్రంలో నిత్య పూజా కైంకర్యాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు.






