బహిరంగ సభకు తరలిరండి
సీపీఐ నగర కార్యదర్శి
ఖమ్మం, రఘనాథపాలెం, డిశంబర్ 29 (విజయక్రాంతి ): భారత కమ్యూనిస్టు పార్టీ శతాబ్ది ఉత్సవాల ముగింపు సందర్భంగా జనవరి 18న జరగనున్న బహిరంగ సభకు పెద్ద ఎత్తున తరలి రావాలని సిపిఐ నగర కార్యదర్శి ఎస్ కె జానిమియా విజ్ఞప్తి చేశారు. బహిరంగ సభ ప్రచార కార్యక్రమంలో భాగంగా సోమవారం స్థానిక జెడ్పి సెంటర్ పాటు పలు కూడళ్లలో ప్రచారం నిర్వహించారు. ప్రజలకు కరపత్రాలను పంచుతూ బహిరంగ సభ ప్రాముఖ్యతను వివరించారు.
ఈ సందర్భంగా జానిమియా మాట్లాడుతూ వందేళ్ల సుదీర్ఘ కాలంలో సిపిఐ ప్రజల పక్షాన అనేక పోరాటాలు చేసి విజయాలు సాధించిందన్నారు. నాటి పోరాటాలను మననం చేసుకుని భవిష్యత్తు పోరాటాలకు కార్యోన్ముఖులను చేసేందుకు జనవరి 18న చారిత్రిక సభను నిర్వహిస్తున్నట్లు జానిమియా తెలిపారు. చరిత్రలో నిలిచిపోయేవిధంగా బహిరంగ సభ జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సమితి సభ్యులు మహ్మద్ సలాం, జిల్లా కార్యవర్గ సభ్యులు పగడాల మల్లేష్, మేకల శ్రీనివాసరావు, యానాలి సాంబశివరెడ్డి, ఏఐటియుసి నాయకులు గాదె లక్ష్మి నారాయణ, ఎస్ కె సైదా, జ్వాలా నర్సింహారావు, కె. సతీష్రెడ్డి, ఈ.వెంకటేశ్వర్లు, శ్రీను, గోపి, లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.






