01-11-2025 04:42:15 PM
సుల్తానాబాద్ (విజయక్రాంతి): సుల్తానాబాద్ పట్టణంలోని జవహర్ నగర్ లో కోతుల దాడిలో గాయపడిన మల్లేశంను మున్సిపల్ కమిషనర్ తిప్పరాజు రమేష్ శనివారం పరామర్శించారు. శుక్రవారం కోతులు ఒకేసారి మూకుమ్మడిగా స్థానికంగా పాల వ్యాపారం నిర్వహిస్తున్న ఎల్లె మల్లేశంపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన విషయం తెలిసిందే, వానరాలు ఒకేసారి మీదకు రావడంతో వాటిని తరిమేందుకు ప్రయత్నించగా మూకుమ్మడిగా దాడి చేయడంతో కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి.
కమిషనర్ మల్లేశంను పరామర్శించి సంఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు. త్వరలోనే కోతులను తరలించేందుకు చర్యలు చేపడుతున్నామని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని కోరారు. మున్సిపల్ లో శాశ్వతంగా కోతులను తరలించేందుకు ప్రత్యేకంగా వాటిని అదుపులోకి తీసుకునే బృందాలను ఏర్పాటు చేస్తున్నామని, త్వరలోనే వానరాల బెడద లేకుండా కృషి చేస్తామని తెలిపారు.